Smriti Mandanna Boyfriend: టీమిండియా మహిళల విభాగంలో మిథాలీ రాజ్ తర్వాత ఆ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది స్మృతి మందాన. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఈ యువతి టీమ్ ఇండియాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బీభత్సమైన బ్యాటింగ్ ద్వారా కోట్ల మంది అభిమానుల ప్రేమను సొంతం చేసుకుంది. అంతేకాదు ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టుకు నాయకురాలిగా కొనసాగుతోంది. ఈమె ఆధ్వర్యంలో బెంగళూరు జట్టు ఒకసారి విజేతగా కూడా నిలిచింది. ఇక ప్రస్తుత ఉమెన్స్ క్రికెట్లో వన్డే విభాగంలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా స్మృతి కొనసాగుతోంది.
ప్రస్తుత మహిళల వన్డే వరల్డ్ కప్ లో స్మృతి అదరగొడుతోంది. ఓపెనర్ గా రంగంలోకి దిగుతున్న ఆమె.. జట్టుకు కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతూ అదరగొడుతోంది. స్మృతి వైవిధ్యభరితమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నది. అందువల్లే స్మృతికి విపరీతమైన అభిమాన గణం ఉంది. ప్రారంభంలో నిదానంగా ఆడి.. ఆ తర్వాత దూకుడు కొనసాగించడం స్మృతికి అలవాటు. వరల్డ్ కప్ లో ఇటీవల ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో స్మృతి ఇదే తీరైన విధానం కొనసాగించింది. అందువల్ల టీమిండియా ఏకంగా 330 పరుగులు చేసింది. దురదృష్టవశాత్తు ఈ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో టీమిండియా విఫలమైంది. అయినప్పటికీ స్మృతి ఆట తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
కర్ణాటక కు చెందిన స్మృతి సినీ నిర్మాత, సంగీత దర్శకుడు పలాష్ మచ్చల్ తో చాలా రోజులుగా ప్రేమలో ఉంది. గడచిన ఆరు సంవత్సరాలుగా వీరిద్దరు డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని సమాచారం. ఇటీవల నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో పలాష్ కీలక వ్యాఖ్యలు చేశాడు..”మీరు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు. అసలు విషయం అదే. త్వరలోనే నాకు నచ్చిన వ్యక్తితో ఏడు అడుగులు వేయబోతున్నాను. ఆమె ఇండోర్ కోడలు కాబోతోంది. ఇకపై ఏమాత్రం ఆలస్యం జరగదని” పలాష్ వ్యాఖ్యానించాడు.. దీంతో స్మృతి వివాహం జరగడం ఖాయమని తెలుస్తోంది.
స్మృతిని వివాహం చేసుకున్నప్పటికీ ఆమె కెరియర్ కు ఏమాత్రం ఇబ్బంది కలిగించబోనని పలాష్ వ్యాఖ్యానించాడు. ఆమె ఎంతో కష్టపడి ఇక్కడ దాకా వచ్చిందని.. వివాహం అనే బంధం ద్వారా ఆమె కెరియర్ మొత్తాన్ని త్యాగం చేయాలని కోరుకోవడం లేదని అతడు వ్యాఖ్యానించాడు. వివాహం జరిగిన తర్వాత కూడా ఆమె స్వేచ్ఛగా క్రికెట్ ఆడుకోవచ్చని.. ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదని అతడు పేర్కొన్నాడు. దీనిని బట్టి స్మృతి వివాహం జరిగిన తర్వాత కూడా క్రికెట్ ఆడుతుందని తెలుస్తోంది.