Homeక్రీడలుక్రికెట్‌Shreyas Iyer Sister Controversy: మీకో దండం రా అయ్యా.. శ్రేయస్ అయ్యర్ సోదరిని వదిలిపెట్టండ్రా..

Shreyas Iyer Sister Controversy: మీకో దండం రా అయ్యా.. శ్రేయస్ అయ్యర్ సోదరిని వదిలిపెట్టండ్రా..

Shreyas Iyer Sister Controversy: అభిమానం ఒకస్థాయి వరకు ఉండాలి. అది హద్దులు దాటితే పరిణామాలు దారుణంగా ఉంటాయి. అందుకే ఏ రంగంలోనైనా కట్టలు తెంచుకునే అభిమానం ఉండకూదని విశ్లేషకులు చెబుతుంటారు. పైగా అభిమానం అనే మత్తులో ఉన్మాద చర్యలు సరికావని చెబుతుంటారు. కానీ మనదేశంలో అభిమానం ముసుగులో దారుణాలకు పాల్పడే అభిమానులే అధికంగా ఉంటారు. పైగా తాము చేస్తున్న పనులను సమర్థించుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఈ తరహా ఉన్మాదుల దారుణాలు […]

Shreyas Iyer Sister Controversy: అభిమానం ఒకస్థాయి వరకు ఉండాలి. అది హద్దులు దాటితే పరిణామాలు దారుణంగా ఉంటాయి. అందుకే ఏ రంగంలోనైనా కట్టలు తెంచుకునే అభిమానం ఉండకూదని విశ్లేషకులు చెబుతుంటారు. పైగా అభిమానం అనే మత్తులో ఉన్మాద చర్యలు సరికావని చెబుతుంటారు. కానీ మనదేశంలో అభిమానం ముసుగులో దారుణాలకు పాల్పడే అభిమానులే అధికంగా ఉంటారు. పైగా తాము చేస్తున్న పనులను సమర్థించుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత ఈ తరహా ఉన్మాదుల దారుణాలు పెరిగిపోయాయి.

ఉన్మాదులైన అభిమానుల తీరు వల్ల మిగతావారు మాత్రమే కాదు, చివరికి సెలబ్రిటీలు, వారి కుటుంబ సభ్యులు కూడా ఇబ్బందిపడతారు. ఈ జాబితాలో చేరిపోయారు ప్రముఖ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సోదరి శ్రేష్ట అయ్యర్. ఆమె అప్పట్లో చేసిన ఓ పని ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె మీద విమర్శలకు కారణమవుతోంది. శ్రేష్ట కొద్ది రోజుల క్రితం కోల్ కతా, పంజాబ్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్ చూసేందుకు హాజరైంది. వర్షం వల్ల ఆమ్యాచ్ రద్దయింది. దీంతో నిర్వాహకులు చేరో పాయింట్ ను ఇరు జట్లకు కేటాయించారు.

మ్యాచ్ ముగిసిన తర్వాత సోషల్ మీడియాలో శ్రేష్ట ఒక వీడియో పోస్ట్ చేసింది. కోల్ కతా జట్టుకు తాము ఒక పాయింట్ బిచ్చం వేసినట్టు డ్యాన్స్ చేసింది. సెటైరికల్ గా మీమ్ కూడా చేసింది. అదికాస్త సోషల్ మీడియాలో సంచలనమైంది. ఈక్రమంలో ఇటీవల పంజాబ్ వరుసగా మ్యాచ్ లు ఓడిపోయి ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. టాప్ స్థానంలో నిలిచిన ఆ జట్టు.. ఇతరజట్ల ఫలితాల మీద ఆధారపడే స్థాయికి దిగజారింది.

పంజాబ్ లీగ్ దశలో చివరి మ్యాచ్ గెలిచినప్పటికీ ఒక్క పాయింట్ తేడాతో ప్లే ఆఫ్ కు దూరమైంది. నాడు కోల్ కతాతో జరిగిన మ్యాచ్ వర్షంవల్ల రద్దుకావడంతో ఒక్క పాయింట్ ను బిచ్చం వేశామని శ్రేష్ట మీమ్ రూపొందించడంతో నెటిజన్లు ఆమెను విమర్శించడం మొదలు పెట్టారు. పంజాబ్ దరిద్రానికి శ్రేష్టనే కారణమంటూ మండిపడ్డారు. ఈక్రమంలో శ్రేష్ట ఓ వీడియో విడుదలచేశారు. తాను కేవలం సరదా కోసమే ఆ వీడియోను రూపొందిచినట్టు చెప్పారు. ఎవరినీ టార్గెట్ చేసి రూపొందించలేదని స్పష్టం చేశారు. తనను అనవసరంగా వివాదాలలో కి లాగవద్దని సూచించారు. కొందరు వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావిస్తున్నారని, ఇది సరైన విధానంకాదని శ్రేష్ట తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియోలో స్పష్టం చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper