Homeఎంటర్టైన్మెంట్Thaman Anirudh Collaboration: ఒకే సినిమాకు కలిసి పనిచేయబోతున్న తమన్ , అనిరుద్.. చరిత్రలో ఎప్పుడూ...

Thaman Anirudh Collaboration: ఒకే సినిమాకు కలిసి పనిచేయబోతున్న తమన్ , అనిరుద్.. చరిత్రలో ఎప్పుడూ జరగని సంఘటన..

Thaman Anirudh Collaboration: ప్రస్తుతం మన సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే , మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు తమన్ , అనిరుద్. ఒకరు సౌత్ మొత్తాన్ని ఏలుతుంటే , మరొకరు టాలీవుడ్ ని ఏలుతున్నారు. ఇద్దరికీ కూడా చేతినిండా సినిమాలు ఉన్నాయి, క్షణం కూడా తీరిక లేని పరిస్థితి. చాలా టైట్ షెడ్యూల్స్ మీద వీళ్ళు సాంగ్స్ కంపోజ్ చేస్తుంటారు. అలాంటి ఈ టాప్ […]

Thaman Anirudh Collaboration: ప్రస్తుతం మన సౌత్ ఇండియా లో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే , మన అందరికీ గుర్తుకు వచ్చే పేరు తమన్ , అనిరుద్. ఒకరు సౌత్ మొత్తాన్ని ఏలుతుంటే , మరొకరు టాలీవుడ్ ని ఏలుతున్నారు. ఇద్దరికీ కూడా చేతినిండా సినిమాలు ఉన్నాయి, క్షణం కూడా తీరిక లేని పరిస్థితి. చాలా టైట్ షెడ్యూల్స్ మీద వీళ్ళు సాంగ్స్ కంపోజ్ చేస్తుంటారు. అలాంటి ఈ టాప్ డైరెక్టర్స్ కలిసి ఒకే సినిమాకు పనిచేస్తారని మనం కలలో అయినా ఊహించి ఉంటామా?, కానీ ఆ అరుదైన సంఘటనకు త్వరలోనే బాలీవుడ్ వేదిక కానుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే , సల్మాన్ ఖాన్ హీరో గా, వంశీ పైడిపల్లి దర్శకత్వం లో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవం రీసెంట్ గానే గ్రాండ్ గా జరిగింది. ఇందులో నయనతార హీరోయిన్ గా నటించబోతుంది. బాలీవుడ్ లో ఒక సినిమాకు అనేక సంగీత దర్శకులు పని చేస్తారని , మన సౌత్ లో లాగా ఒక సినిమాకు , ఒకే మ్యూజిక్ డైరెక్టర్ వంటివి వాళ్ళ దగ్గర ఉండదని మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు సల్మాన్ ఖాన్ చిత్రానికి ఈ ఇద్దరు టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేయబోతున్నారు. ఇక మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మీరే ఊహించుకోండి. తమన్ ఇప్పటికే బాలీవుడ్ లో కొన్ని చిత్రాలకు మ్యూజిక్ అందించాడు కానీ , అవి పెద్ద రేంజ్ లో క్లిక్ అవ్వలేదు. కానీ అనిరుద్ మాత్రం ‘జవాన్’ చిత్రంతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి , తొలిసినిమాతోనే సిక్సర్ కొట్టేశాడు. అయితే ప్రస్తుతం ఇద్దరు మంచి ఫార్మ్ లోనే ఉన్నారు , సల్మాన్ కి అదిరిపోయే రేంజ్ మ్యూజిక్ ఇస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కి మంచి సినిమా అవసరం ఉంది. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. ఇప్పటి తరం యూత్ ఆడియన్స్ కి ఒక సినిమాపై ఆసక్తి కలగాలంటే, కచ్చితంగా పాటలు అద్భుతంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే ఇప్పుడు సల్మాన్ ఖాన్ విషయం లో జరగబోతుంది . కాబట్టి ఈసారి సల్మాన్ ఖాన్ కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నాడని , పైగా వంశీ పైడిపల్లి కూడా మినిమం గ్యారంటీ డైరెక్టర్ అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper