spot_img
Homeక్రీడలుక్రికెట్‌T20 World Cup 2024 : రోహిత్ ఇంకానా?.. హార్దిక్ తో ఉపయోగం లేదు.. టి20...

T20 World Cup 2024 : రోహిత్ ఇంకానా?.. హార్దిక్ తో ఉపయోగం లేదు.. టి20 వరల్డ్ కప్ కెప్టెన్ ఇతడే..

T20 World Cup 2024 : ఐపిఎల్ సీజన్లో రోహిత్ మెరుపులు మెరిపిస్తున్నాడు. అద్భుతంగా ఆడుతున్నాడు. ఉన్నంత సేపు దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా రాణించలేకపోతున్నప్పటికీ.. తీసిపారేయలేనంత ఆటగాడు కాదు. తనదైన రోజు వస్తే బ్యాటింగ్, బౌలింగ్లో అతడు సత్తా చాట గలడు. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడు.. అయితే వీరిద్దరూ ఉన్నప్పటికీ ఐపీఎల్ లో ముంబై జట్టు ఆశించినత స్థాయిలో ఆడటం లేదు. పాయింట్ పట్టికలో కింది వరుసలో ఉంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఫలితంగా ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో ముంబై జట్టు ఆట తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తవుతున్నాయి. మాజీ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు ముంబై జట్టును ఏకి పారేస్తున్నారు. అందులో టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

రాజస్థాన్ జట్టు తో జరిగిన మ్యాచ్లో ముంబై ఓడిపోయిన నేపథ్యంలో.. హర్భజన్ సింగ్ ఆ జట్టు ఆటగాళ్ళను తీవ్రంగా విమర్శించాడు..”చాలామంది ఆటగాళ్లు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుంటారు. చాలామంది నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. కొన్నిసార్లు జట్టుకు దూరం కూడా అవుతుంటారు. అలాంటి వారికి ఒకటే చెప్పేది. ఫామ్ అనేది తాత్కాలికం. క్లాస్ అనేది శాశ్వతం. దీనికి ఉదాహరణ యశస్వి జైస్వాల్ ఆడిన ఇన్నింగ్స్. వికెట్ కీపర్, బ్యాటర్ గా సంజూ సాంసన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒకవేళ అతడికి అవకాశం ఇస్తే టీ – 20 ప్రపంచ కప్ వరకే పరిమితం చేయొద్దు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే వర్తమాన ఆటగాళ్ల చేతుల్లోకి టీమిండియా వెళ్లిపోవడం మంచిదనిపిస్తోంది. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్సీ బాధ్యతను అప్పగించాల్సి వస్తే.. సంజూ సాంసన్ కు ఇవ్వడం మంచిది. ఆ తర్వాత రోహిత్ ను ఇంకా కెప్టెన్ గా కొనసాగించడంలో అర్థం లేదని” హర్భజన్ సింగ్ ట్విట్టర్ ఎక్స్ లో రాసుకొచ్చాడు.

యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ను హర్భజన్ సింగ్ కొనియాడాడు. ఇదే సమయంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పట్ల ఒకింత నిర్వేదం వ్యక్తం చేశాడు. అతడు పనికిరాడనే స్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. కాగా, ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ జట్టు సారధిగా సంజు శాంసన్ అద్భుతంగా ఆడుతున్నాడు. జట్టు కూర్పు కూడా చాలా బాగుంది. ఆటగాళ్లు కీలకమైన సమయాల్లో రాణిస్తున్నారు. అసలు ఈ సీజన్లో ఎటువంటి అంచనాలు లేకుండా మైదానంలోకి అడుగుపెట్టిన రాజస్థాన్ జట్టు.. అద్భుతమైన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో గెలుపొంది ప్లే ఆఫ్ ఆశలను మరింత పటిష్టం చేసుకుంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Balakrishna

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...
Thalapathy Vijay

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...
Anil Ravipudi

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Venu Swamy Bigg Boss Remuneration

Venu Swamy Prediction : కాక్రోచ్ జనతా పార్టీ భవిష్యత్తుపై వేణుస్వామి హాట్ కామెంట్స్.. వీడియో వైరల్..

Venu Swamy Prediction : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఒకప్పుడు ఎలాంటి వివాదాస్పద జాతకాలు చెప్పేవాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన చెప్పే జాతకాలు కారణంగా సోషల్ మీడియా లో తీవ్రమైన...

Narendra Modi : వెన్నుచూపని మోడీ తగ్గాడా.. కాక్రోచ్ ల చేతిలో ఓడిపోయాడా

Narendra Modi : అవి అసాంఘిక శక్తులని తెలుసు. అవి చేస్తున్న ఉద్యమం సో కాల్డ్ అని కూడా తెలుసు. దానిని ఎలా వంచాలో కూడా తెలుసు. అయినప్పటికీ నరేంద్ర మోడీ బయపడ్డారు....
Oktelugu Epaper