spot_img
Homeక్రీడలుRavichandran Ashwin: అశ్విన్ 100 టెస్ట్.. భార్య ప్రీతినారాయణ్ ఏమన్నదంటే.. వీడియో వైరల్

Ravichandran Ashwin: అశ్విన్ 100 టెస్ట్.. భార్య ప్రీతినారాయణ్ ఏమన్నదంటే.. వీడియో వైరల్

Ravichandran Ashwin: ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న ఐదవ టెస్ట్ ద్వారా.. తన కెరియర్లో 100 వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ ను బీసీసీఐ ఘనంగా సన్మానించింది. ఆటకు ముందు జరిగిన వేడుకలో సహచర ఆటగాళ్ల సమక్షంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ 100 టెస్ట్ అని రాసి ఉన్న క్యాప్ ను బహుకరించాడు.. ఈ కార్యక్రమానికి రవిచంద్రన్ అశ్విన్ సతీమణి ప్రీతి నారాయణ్, అతడి ఇద్దరి కూతుర్లు హాజరయ్యారు. క్యాప్ బహుకరిస్తున్నప్పుడు ప్రీతి నారాయణ్ ఆనందానికి అవధులు లేవు. అతని కూతుర్లు ఆ క్యాప్ ను చూసి ఎంతో మురిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. వీడియోకు ముందు “రవిచంద్రన్ 100 టెస్ట్, అతడి సతీమణి ప్రీతి నారాయణ్ అభిప్రాయాలు” అని క్యాప్షన్ పెట్టింది.

రవిచంద్రన్ అశ్విన్ రాహుల్ ద్రావిడ్ నుంచి క్యాప్ బహుమతిగా అందుకున్న తర్వాత.. ప్రీతి నారాయణ్ మాట్లాడింది..” ఇది అద్భుతం. ఆనందకరమైన సమయం. కానీ దీనికంటే ముందు కొద్ది రోజులు మా కుటుంబం ఎంతో ఒత్తిడి ఎదుర్కొంది. అయినప్పటికీ ఈ విషయం నా భర్తకు తెలియకుండా జాగ్రత్తపడ్డాం. కానీ ఆయన మ్యాచ్ మధ్యలో నుంచి వచ్చారు. ఆసుపత్రిలో ఉన్న తన తల్లిని చూసుకున్నారు. మరుసటి రోజు మళ్లీ ఆటకు వెళ్లిపోయారు. ఇటు ఆటను, అటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేశారు. ఆట మీద అశ్విన్ కు ఎంత ప్రేమ ఉంటుందో ఇది చిన్న ఉదాహరణ. ఇటీవల 500 వికెట్లు తీసిన ఘనతను అశ్విని సాధించాడు. ఇప్పుడు వందో టెస్ట్ ఆడబోతున్నాడు. అతడు ఇలాంటి మైలురాళ్లను ఎన్నో అందుకోవాలి. ఇంకా ఇంకా ఎన్నో మ్యాచ్లు ఆడాలని” ప్రీతి వ్యాఖ్యానించింది.

కాగా, రవిచంద్రన్ అశ్విన్ ను రాహుల్ ద్రావిడ్ సన్మానించిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడంతో.. నెటిజన్లు స్పందిస్తున్నారు. “ఈ ఘనత సాధించిన భారత బౌలర్ కు శుభాకాంక్షలు. ఇలాంటి మ్యాచులు మరెన్నో ఆడి భారత జట్టుకు చిరస్మరణీయమైన విజయాలు అందించాలని కోరుకుంటున్నామని” కామెంట్లు చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మరోవైపు బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా ట్విట్టర్ వేదికగా రవిచంద్రన్ అశ్విన్ కు శుభాకాంక్షలు తెలిపారు. 100 టెస్ట్ ఆడుతున్న క్రికెట్ లెజెండ్ కు అభినందనలు అని కామెంట్ చేశాడు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Jana Nayagan First Day Collection

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
India vs Zimbabwe

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...
NEET Paper Leak

NEET Paper Leak: పేపర్ లీక్ చేసే ఊహే రాకుండా.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఎంత కఠినంగా ఉందో...

NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువకులు ఏకంగా పార్లమెంటు మీదికి దూసుకుపోయారు. కేంద్ర...
Tech Mahindra Employee

Tech Mahindra Employee: ఐటీ ఉద్యోగం అంటేనే పేక మేడ.. ఎప్పుడు ఊడుతుందో ఎవరికి ఎరుక.. పాపం ఈ...

Tech Mahindra Employee: ఇన్ని రోజులపాటు చేసిన చోట ఉద్యోగం లేదంటే.. ఆ ఉద్యోగి కి ఎంత కష్టం ఉంటుంది.. హాయిగా పని చేసుకుంటూ.. బ్రహ్మాండంగా జీతం తీసుకుంటూ.. జీవితాన్ని సాగిస్తున్న ఆమెకు...
Pawan Kalyan

Pawan Kalyan: క్యాబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. కారణం ఏంటంటే..

Pawan Kalyan: సచివాలయం లో నేడు సీఎం చంద్రబాబు నాయుడు అద్వర్యం లో జరిగిన క్యాబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గైర్హాజరు అవ్వడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం...
Oktelugu Epaper