Ravichandran Ashwin: సామాన్యులు మాత్రమే కాదు.. సెలబ్రిటీలు కూడా తమ వరకు వచ్చేసరికి దేనినీ అంతగా పాటించరు. అదే మిగతా వారి విషయంలో మాత్రం నీతులు చెబుతుంటారు. సుద్దులు వల్లె వేస్తుంటారు.. సూక్తి ముక్తావళిని చదువుతుంటారు. ఉదాహరణకు క్రికెట్ ను చూసుకుంటే మాజీ దిగ్గజ ఆటగాడు.. మిగతా ఆటగాళ్ల విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటాడు. కొన్నిసార్లు పరిధి దాటి వ్యవహరిస్తుంటాడు. అదే తన కొడుకు రోహన్ గవాస్కర్ విషయంలో మాత్రం సైలెంట్ గా ఉంటాడు. రోహన్ కు వచ్చిన అవకాశాలను.. అతడు వినియోగించుకొని తీరును ఏమాత్రం ప్రస్తావించడు. ఇలా చెప్పుకుంటూ పోతే క్రికెటర్లలో చాలామంది ఉన్నారు. తమకింది నలుపును వారు చూసుకోలేరుగాని.. ఎదుటివారి నలుపును మాత్రం అద్భుతంగా ఎంచుతారు.
Also Read: 300 లోడింగ్.. సన్ రైజర్స్ కు మొదటికే మోసం!
అందుకే చెప్పడం లేదట
గత ఏడాది టీమిండియా ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియా తో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా సాధించిన అనేక విజయాలలో రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత.. అతడు ఒక యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టాడు. అందులో వివిధ రకాల మ్యాచులకు సంబంధించిన రివ్యూలను అతడు చెప్పేవాడు. ఇందులో కొంత జెన్యునిటీ కనిపించేది. కానీ ప్రస్తుత ఐపిఎల్ సీజన్లో రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో మ్యాచులకు సంబంధించిన రివ్యూలు ప్రసారం అవుతున్నాయి. అయితే ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మాత్రం అవకాశం లేకుండా పోయింది. అయితే గత వారం నుంచి ఈ విషయంపై తీవ్రంగా చర్చ సాగుతోంది. అన్ని జట్ల గురించి రవిచంద్రన్ యూట్యూబ్ ఛానల్ లో చర్చ జరుగుతుంటే.. చెన్నై సూపర్ కింగ్స్ కు మాత్రం ఎందుకు మినహాయింపు ఇచ్చారంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.. దీంతో రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించే వ్యక్తులు స్పందించక తప్పలేదు. దీంతో వారు ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు.. తాము కుదుర్చుకున్న ముందస్తు ఒప్పందం ప్రకారమే చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మ్యాచ్లకు సంబంధించిన రివ్యూలు వెల్లడించడం లేదని.. కాకపోతే ఇందులో రవిచంద్రన్ వ్యక్తిగత అభిప్రాయాలకు తావు లేదని పేర్కొన్నారు.. ముందుగానే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడే మ్యాచ్లకు సంబంధించిన రివ్యూ, ప్రివ్యూలకు దూరంగా ఉండాలని తమ నిర్ణయించుకున్నామని.. అందువల్లే ఆ ఒప్పందాన్ని కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. అయితే దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ” రవిచంద్రన్ అశ్విన్ కు ఇందులో ప్రమేయం లేదని మీరు ఎలా చెబుతారు.. ఛానల్ పేరు రవిచంద్రన్ అశ్విన్ తో ఉన్నప్పుడు ఆయనకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది.. ఆయన ఆడుతున్న జట్టు కాబట్టి మీరు రివ్యూ, ప్రివ్యూ చెప్పడం లేదు. ఇదే విధానం మిగతా జట్లపై కూడా కొనసాగిస్తే బాగుంటుంది కదా.. ఒక జట్టును పక్కనపెట్టి మిగతా జట్ల గురించి మాట్లాడితే.. అందులో క్రీడా స్ఫూర్తి ఏముంటుంది. మీరు చెప్పేవన్నీ వాస్తవాలని నమ్మాల్సిన అవసరం ఏముందని” నెటిజన్లు మండిపడుతున్నారు.