Ashwin Praises Shree Charani: వరుసగా మూడు ఓటములు.. దీంతో ఎవరికీ కూడా ఎటువంటి అంచనాలు లేవు. ఇలాంటి క్రమంలో బౌన్స్ బ్యాక్ అనే సిద్ధాంతాన్ని నూటికి నూరు శాతం అమలు చేస్తూ.. ఫినిక్స్ పక్షి లాగా ఎగిరింది భారత మహిళల జట్టు. గెలవాల్సిన సందర్భంలో న్యూజిలాండ్ జట్టు మీద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సెమి ఫైనల్లో ఆస్ట్రేలియా మీద అద్భుతమైన గెలుపును దక్కించుకుంది. ఇక ఫైనల్ మ్యాచ్లో అయితే దక్షిణాఫ్రికా జట్టుతో నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడి.. చివరికి నెగి కలల ప్రపంచ కప్ ను సగర్వంగా ఎత్తుకుంది. ఫైనల్ మ్యాచ్లో దీప్తి శర్మ, షఫాలి వర్మ, శ్రీ చరణి.. అద్భుతమైన ప్రదర్శన చేయడంతో టీమిండియా అనితర సాధ్యమైన గెలుపును సొంతం చేసుకుంది.
Also Read: మగాళ్ళు కొట్టలేదు.. మన ఆడబిడ్డలు కప్ కొట్టి చూపించారు..
టీమిండియా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మాజీ క్రికెటర్లు తమదైన విశ్లేషణ చేస్తున్నారు. ఇందులో ఒక విశ్లేషణ మాత్రం చాలా ఆసక్తికరంగా అనిపించింది. అది చేసింది టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. అయితే అతడు మాట్లాడింది ఓ 21 సంవత్సరాల యువ సంచలనం గురించి.. ఆమె చేస్తున్న బౌలింగ్.. ఆమె తీసిన వికెట్లు.. ఆమె సాధించిన ఎకానమీ.. ఆమె సంధించిన బంతుల గురించి అశ్విన్ అద్భుతంగా చెప్పాడు. అతడు చెప్పిన మాటల్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. పైగా ఆ బౌలర్ కు ఇంకా మరింత గొప్ప శిక్షణ ఇస్తే తిరుగులేని స్థాయిలో రాణిస్తుందని.. టీమిండియాలో వుమెన్ అనిల్ కుంబ్లే అవుతుందని అతడు పేర్కొన్నాడు. ఇంతకీ అతడు చెప్పిన ఆ బౌలర్ ఎవరంటే..
టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించిన సందర్భంలో.. మహిళ ప్లేయర్ల మీద ప్రశంసలు కురుస్తున్నాయి. మహిళా జట్టులో 21 సంవత్సరాల కడప అమ్మాయి శ్రీ చరణి కూడా ఉంది. వాస్తవానికి ఈ అమ్మాయి అద్భుతంగా బౌలింగ్ చేస్తుంది.. పిచ్ ఎలాంటిదైనా సరే బంతి నుంచి స్పిన్ రాబడుతుంది. అందువల్లే వన్డే వరల్డ్ కప్ లో అద్భుతమైన వికెట్లు సాధించింది. అంతర్జాతీయ టోర్నీలలో నెలల అనుభవమే ఉన్నప్పటికీ .. ఎంతో ఎక్స్పీరియన్స్ బౌలర్ మాదిరిగా బౌలింగ్ వేసింది. టీమిండియాలో ఎంతోమంది లెజెండ్ రీప్లేయర్ లో ఉన్నప్పటికీ.. కెప్టెన్ కౌర్ శ్రీ చరణి కి అవకాశం ఇచ్చింది. వచ్చిన అవకాశాలను ఈ కడప అమ్మాయి సద్వినియోగం చేసుకుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించింది. ఇక ఫైనల్ మ్యాచ్లో ఒక వికెట్ తీసి దక్షిణాఫ్రికా జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పైగా అద్భుతమైన ఎకనామి రేటు సాధించింది. 9 మ్యాచ్ లు ఆడిన ఈ కడప అమ్మాయి 27.64 సగటుతో 14 వికెట్లు పడగొట్టింది.
“ఆమె బంతి వేస్తున్న తీరు అద్భుతంగా ఉంది. బంతిని టర్న్ చేస్తున్న తీరు ఆశ్చర్యంగా ఉంది. అందువల్లే ఆమెను ఎదుర్కోవడం పెద్ద పెద్ద బ్యాటర్లకు కూడా సాధ్యం కావడం లేదు. ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇది నిరూపితమైంది. ధోని 2007లో యంగ్ ప్లేయర్లతో టి20 వరల్డ్ కప్ సాధించాడు. 2025లో కౌర్ యంగ్ ప్లేయర్లతో వన్డే వరల్డ్ కప్ సాధించింది. ధోని ప్రభావం ఇప్పటికి టీమ్ ఇండియా మీద ఉంటుంది. కౌర్ చూపించిన తెగువ భవిష్యత్తు కాలంలో టీమ్ ఇండియా మీద అధికంగా ఉంటుంది. సాధారణంగా ఇటువంటి ప్లేయర్లకు అవకాశాలు ఎక్కువగా ఇవ్వాలి. తర్ఫీదు కూడా ఎక్కువగా ఇవ్వాలి. అప్పుడే వారు మరింత రాటు తేల్తారని” అశ్విన్ పేర్కొన్నాడు.