Homeక్రీడలుక్రికెట్‌Rajasthan Royals Vs Sunrisers Hyderabad: ప్లే ఆఫ్ సమరం: రాజస్థాన్ వర్సెస్ సన్...

Rajasthan Royals Vs Sunrisers Hyderabad: ప్లే ఆఫ్ సమరం: రాజస్థాన్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్.. ఫైనల్ వెళ్లేది ఎవరంటే..

Rajasthan Royals Vs Sunrisers Hyderabad: తొలి ప్లే ఆఫ్ లో గుజరాత్ మీద బెంగళూరు విజయం సాధించింది. దర్జాగా రెండోసారి ఫైనల్ వెళ్లిపోయింది. రెండో ప్లే ఆఫ్ బుధవారం జరగనుంది. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ లో పోటీ పడపోతున్నాయి. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు నేరుగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు క్వాలిఫైయర్2 లో ఆడుతుంది. అందువల్ల విజయం కోసం అటు రాజస్థాన్, ఇటు హైదరాబాద్ హోరాహోరీగా […]

Rajasthan Royals Vs Sunrisers Hyderabad: తొలి ప్లే ఆఫ్ లో గుజరాత్ మీద బెంగళూరు విజయం సాధించింది. దర్జాగా రెండోసారి ఫైనల్ వెళ్లిపోయింది. రెండో ప్లే ఆఫ్ బుధవారం జరగనుంది. రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ లో పోటీ పడపోతున్నాయి. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు నేరుగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టు క్వాలిఫైయర్2 లో ఆడుతుంది. అందువల్ల విజయం కోసం అటు రాజస్థాన్, ఇటు హైదరాబాద్ హోరాహోరీగా ఆడతాయనడంలో ఎటువంటి సందేహం లేదు.

లీగ్ పోటీలు జరుగుతున్నప్పుడు హైదరాబాద్ 14 మ్యాచ్ లలో 9 విజయాలు సాధించింది. గుజరాత్ జట్టుతో సమానంగా పాయింట్లు సాధించినప్పటికీ నెట్ రన్ రేట్ వల్ల మూడో స్థానానికి పరిమితంకావాల్సి వచ్చింది. రాజస్థాన్ ఈ సీజన్ లో 8 విజయాలు అందుకుంది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది.

ఇక మ్యాచ్ లో సన్ రైజర్స్ సత్తా చూపించాలని భావిస్తోంది. ఐపీఎల్ సీజన్లో చివరి పది మ్యాచ్ లలో హైదరాబాద్ ఏకంగా ఎనిమిదింట్లో విజయం సాధించింది. గడిచిన ఏడు మ్యాచ్ లకు హైదరాబాద్ జట్టుకు కమిన్స్ నాయకత్వం వహించాడు. ప్రస్తుత సీజన్ లో హైదరాబాద్ రాజస్థాన్ తో ఆడిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. దీంతో ఆరెంజ్ ఆర్మీలో సానుకూలత తొణికిసలాడుతోంది. సన్ రైజర్స్ లో అభిషేక్ శర్మ(563), హెడ్(393), ఇషాన్ కిషన్(569), క్లాసెన్(606) సూపర్ ఫామ్ లో ఉన్నారు.

హెడ్ స్థిరమైన ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నాడు. బౌలింగ్ లో కూడా హైదరాబాద్ సత్తా చూపిస్తోంది. కమిన్స్ ఏడు మ్యాచ్లలో 8 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇషాన్ మలింగ 19 వికెట్లు, సాకిబ్ హుస్సేన్ 15 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. మిడిల్ ఓవర్లలో శివాంగ్ కుమార్ దుమ్ము రేపుతున్నాడు. వీరంతా సూర్యవంశీని కట్టడి చేస్తేనే రాజస్థాన్ దూకుడుకు కళ్లెం వేయవచ్చు.

రాజస్థాన్ లో సూర్యవంశీ(583), యశస్వి జైస్వాల్(397), ధ్రువ్ జూరెల్(458) పరుగులతో సూపర్ ఫామ్ లో కొనసాగుతున్నారు. జైస్వాల్ స్థిరంగా ఆడాల్సిన అవసరం ఉంది. రాజస్థాన్ భవితవ్యం మొత్తం 15 ఏళ్ల సూర్యవంశీ మీద ఆధారపడి ఉంది. అతడు గనుక అదరగొడితే రాజస్థాన్ బీభత్సంగా రన్స్ సాధించడం ఖాయం. రాజస్థాన్ లో జోఫ్రా ఆర్చర్ కీలక బౌలర్ గా కొనసాగుతున్నాడు. అతడు రాణిస్తే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదు. ఆర్చర్ ఇప్పటివరకు 21,. బ్రిజేష్ శర్మ 13, బర్గర్ 11 వికెట్లను దక్కించుకున్నారు . యశ్ రాజ్ పుంజా కూడా 8 వికెట్లను పడగొట్టారు. జడేజా కూడా ఇప్పటివరకు 8 వికెట్లను తీయడమే కాకుండా, 209 పరుగులు చేశాడు.

రాజస్థాన్ తో హైదరాబాద్ ఇప్పటి వరకు 23 మ్యాచ్ లు ఆడింది. ఇందులో 14 మ్యాచ్ లలో విజయం సాధించింది. రాయల్స్ 9 విజయాలు సొంతంచేసుకుంది. ప్రస్తుత సీజన్ లో రెండు, గతంలో మూడు, మొత్తం ఐదు మ్యాచ్ లలో హైదరాబాద్ విక్టరీలను అందుకోవడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper