spot_img
Homeక్రీడలుక్రికెట్‌MS Dhoni: ధోని వచ్చాడు.. పూనకాలు తెచ్చాడు.. వైరల్ వీడియో

MS Dhoni: ధోని వచ్చాడు.. పూనకాలు తెచ్చాడు.. వైరల్ వీడియో

MS Dhoni: ధోని.. ఈ రెండు అక్షరాల పదం టీమిండియా క్రికెట్ చరిత్రను మొత్తం మార్చేసింది. ధోనికి ముందు ధోని తర్వాత అన్నట్టుగా చేసింది.. అగ్రెసివ్ ఆట తీరును టీమిండియా కు సరికొత్తగా పరిచయం చేసింది. ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని నేలమట్టం చేసింది. దక్షిణాఫ్రికా దూకుడును.. న్యూజిలాండ్ వేగాన్ని తగ్గించింది. పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. అందువల్లే ధోని టీమ్ ఇండియాలో అద్భుతమైన ఆటగాడిగా.. అనితర సాధ్యమైన సారథిగా నిలిచిపోయాడు.

ధోని జాతీయ జట్టు నుంచి నిష్క్రమించినప్పటికీ.. ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున ఆడుతున్నాడు. గత సీజన్లో తాత్కాలిక సారధిగా వ్యవహరించాడు. అతని నాయకత్వంలో చెన్నై జట్టు గొప్పగా ప్రదర్శన చేయలేదు. ఈ సీజన్లో ఆడతాడు అనుకున్నప్పటికీ.. అతడు ఒక మ్యాచ్లో కూడా కనిపించలేదు. పైగా గాయాల వల్ల ధోని మైదానంలో కనీసం అడుగు కూడా పెట్టలేదు.. ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ అప్డేట్స్ ఇస్తున్నప్పటికీ.. అవి కేవలం అభిమానులకు తాత్కాలిక ఆనందాన్ని మాత్రమే ఇచ్చాయి.

ఇటీవల ipl సీజన్లో చివరి మ్యాచ్ ఆడిన తర్వాత చెన్నై జట్టు ప్లేయర్లు అభిమానులకు అభివాదం చేశారు. అందులో ధోని కూడా ఉన్నాడు. అభిమానులతో ఫోటోలు దిగాడు. జట్టు ప్లేయర్లతో ఫోటోలకు ఫోజులిచ్చాడు. చిరునవ్వుతో కనిపించాడు. అతడు మైదానంలోకి దిగడమే ఆలస్యం చెన్నై అభిమానులు కేరింతలు కొట్టారు. ఒకవేళ అతడు గనుక బ్యాట్ పట్టుకొని రంగంలోకి దిగి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేదేమో.

అభిమానులు తన రాక గురించి విపరీతంగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో చిరుకానుక అందించాడు ధోని. ప్రస్తుతం ఝార్ఖండ్ t20 లీగ్ నడుస్తోంది. ఆట్రోఫీలో భాగంగా ధోని మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు. టాస్ ప్రక్రియలో పాల్గొన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపు నిర్వాహకులతో మాట్లాడాడు. ఆయా జట్ల ప్లేయర్లతో ఫోటోలకు ఫోజులిచ్చాడు. చివరికి భార్య.. కుమార్తెతో కలిసి మైదానంలో సందడి చేశాడు. ఆ తర్వాత రాంచి మైదానంలో కూర్చొని మ్యాచ్ చూసాడు.. ధోని గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడంతో రాంచీ మైదానం హోరెత్తిపోయింది. అంతేకాదు ధోని వస్తున్నాడని ముందుగానే నిర్వాహకులు చెప్పడంతో టికెట్లు అమ్ముడుపోయాయి. అంతేకాదు మైదానం కూడా ప్రేక్షకులతో కిటకిటలాడింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
Harish Rao

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...
Oktelugu Epaper