Homeక్రీడలుక్రికెట్‌MS Dhoni Injury: చెన్నై జట్టుకు బిగ్ షాక్.. ఇలా జరుగుతుందని ధోని అభిమానులు కలలో...

MS Dhoni Injury: చెన్నై జట్టుకు బిగ్ షాక్.. ఇలా జరుగుతుందని ధోని అభిమానులు కలలో కూడా ఊహించలేదు..

MS Dhoni Injury: ఐపీఎల్ లో ఎంతోమంది ప్లేయర్లు వచ్చారు.. ఎంతోమంది ప్లేయర్లు పోయారు. కానీ ఐపీఎల్ కు మేరునగ పర్వతంలాగా నిలబడిన ప్లేయర్లు కొద్దిమంది మాత్రమే ఉంటారు. అందులో ధోని ముందు వరుసలో ఉంటాడు. ధోని చెన్నై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీలు అందించాడు. ముంబై జట్టుతో సమానంగా నిలపాడు. విపరీతమైన పోటీ ఉండే ఐపీఎల్లో చెన్నై జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచిందంటే మామూలు విషయం కాదు. దీని వెనక ధోని అవిశ్రాంత కృషి ఉంది. అతడు […]

MS Dhoni Injury: ఐపీఎల్ లో ఎంతోమంది ప్లేయర్లు వచ్చారు.. ఎంతోమంది ప్లేయర్లు పోయారు. కానీ ఐపీఎల్ కు మేరునగ పర్వతంలాగా నిలబడిన ప్లేయర్లు కొద్దిమంది మాత్రమే ఉంటారు. అందులో ధోని ముందు వరుసలో ఉంటాడు. ధోని చెన్నై జట్టుకు ఐదుసార్లు ట్రోఫీలు అందించాడు. ముంబై జట్టుతో సమానంగా నిలపాడు.

విపరీతమైన పోటీ ఉండే ఐపీఎల్లో చెన్నై జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచిందంటే మామూలు విషయం కాదు. దీని వెనక ధోని అవిశ్రాంత కృషి ఉంది. అతడు జట్టు ప్లేయర్లలో పోరాట స్ఫూర్తిని నిలిపాడు. అందువల్లే చెన్నై జట్టు సమష్టి కృషితో విజేతగా నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో సువర్ణ అధ్యాయాలను సృష్టించింది. సరికొత్త ఘనతలను అందుకుంది.

చెన్నై జట్టు సారధ్య బాధ్యతలనుంచి 2024లో ధోని తప్పుకున్నాడు. ఆ సీజన్లో గైక్వాడ్ నాయకుడిగా ఎంపిక అయ్యాడు. అయితే 2024 లో చెన్నై జట్టు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది. టైటిల్ ఫేవరెట్ గా రంగంలో దిగిన చెన్నై.. అంచనాలను అందుకోలేకపోయింది. తద్వారా డిపెండింగ్ ఛాంపియన్ హోదాను చెన్నై జట్టు నిలుపుకోలేకపోయింది.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో చెన్నై జట్టుకు ఊహించని షాక్ తగిలింది. చెన్నై జట్టు వికెట్ కీపర్.. మాస్టర్ మైండ్ ధోని ఈ టోర్నీకి కొద్ది రోజులపాటు దూరం కాబోతున్నాడు. అతడు కొద్దిరోజులుగా కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. అందువల్ల వైద్యుల సూచన మేరకు కొద్ది వారాలపాటు అతడు ఈ టోర్నీకి దూరంగా ఉండబోతున్నాడు. ఇది అభిమానులకు చేదువార్త. ఈ విషయాన్ని చెన్నై మేనేజ్మెంట్ ఇంకా ధ్రువీకరించలేదు. జాతీయ మీడియాలో మాత్రం ధోని ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

గత సీజన్లో కూడా ధోని అనారోగ్యంగా కనిపించాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. తాత్కాలిక సారధిగా మైదానంలోకి దిగినప్పటికీ.. అతడి వ్యూహాలు అంతగా అమలు కాలేదు. ప్రణాళికలు విజయవంతం కాలేదు. జట్టులో ప్లేయర్ల ఆటతీరు పట్ల ధోని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందువల్లే ఈ సీజన్లో చెన్నై మేనేజ్మెంట్ జట్టులో అనేక రకాలుగా మార్పులు తీసుకొచ్చింది. కొత్త కొత్త ప్లేయర్లను కొనుగోలు చేసింది. అయితే అన్ని శుభశకునములే అనుకుంటుండగా ధోని అనారోగ్యం చెన్నై జట్టును.. చెన్నై అభిమానులను కలవరానికి గురిచేస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper