YSR Congress Amaravati Strategy: అమరావతి( Amravati capital ) విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత మాదిరిగా జాప్యం చేస్తామంటే కుదరదు. కొత్త రకాల కుట్రలు చేస్తామన్న ఇట్టే బయటకు తెలిసిపోతుంది. అందుకే అమరావతి అంశానికి ఒక ఎండ్ కార్డ్ వెయ్యాలని ఆ పార్టీ నేతలే కోరుతూ వస్తున్నారు. మరి అమరావతిపై ముందుకు సాగితే మాత్రం అంతిమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టమని చెబుతున్నారు. ఒకవైపు అమరావతికి అనుకూలమని చెబుతూనే.. తెర వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారాలు బయటకు వస్తున్నాయి. ప్రజలకు కూడా అర్థం అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో అమరావతిపై ఇంకా నాన్చుడు ధోరణి అంతిమంగా ఆ పార్టీకే నష్టం. ఎందుకంటే 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి అమరావతిని ఎంపిక చేసింది ఏకాభిప్రాయంతో. నాడు ప్రధాన ప్రతిపక్షంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తరువాత అధికారపక్షంలోకి వచ్చిన ఆ పార్టీ.. ఇప్పుడు మళ్లీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ చెబుతున్న మాటలు ప్రజలకు తెలుసు.
* చట్టబద్ధత ఖాయం..
అమరావతిని ఇకనుంచి టచ్ చేయలేని స్థితిలోకి మార్చే ప్రయత్నంలో ఉన్నారు చంద్రబాబు( CM Chandrababu). తనకు సహకరించే కేంద్ర ప్రభుత్వం ఎలానూ ఉంది. అందుకే ఆయన చట్టబద్ధత కల్పిస్తారు. అందులో సక్సెస్ అవుతారు కూడా. అయితే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి అన్నది మాత్రం తెలియడం లేదు. సభకు వస్తే కచ్చితంగా ప్రభుత్వ తీర్మానాని కి మద్దతు తెలపాలి. అదే చేస్తే గతంలో తాము చేసిన తప్పిదాలను ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వ్యతిరేకిస్తే మాత్రం అమరావతికి వ్యతిరేకం అనే శాశ్వతంత్రం ఉంటుంది. అందుకే ఇప్పుడు రైతులకు కోణంలో బెంగళూరు కేంద్రంగా కొత్త రాజకీయం మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
* సైలెంట్ గా ఉండలేక..
ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా ఉండడమే మంచిది. కానీ ఆ పార్టీ ఆ పని చేయడం లేదు. అమరావతి అనే పదం ఆ పార్టీకి మింగుడు పడని విధంగా ఉంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో మరో ప్రయత్నం చేయాలని అమరావతి రైతులకు అన్యాయం అనే మాటలు చెప్పడం ద్వారా.. చట్టబద్ధతను అడ్డుకునే ప్రయత్నంలో ఉందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఏ రైతులపై కేసులు పెట్టారో.. ఏ రైతుల ఉద్యమాన్ని అడ్డుకున్నారో.. అదే రైతుల ప్రయోజనాల పేరిట కొత్త రాజకీయం మొదలు పెట్టాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుందట. తద్వారా పార్లమెంటులో చట్టబద్ధతను జాప్యం చేయాలన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కానీ ఆ పార్టీ ప్రయత్నాలను నిర్వీర్యం చేస్తూ ముందుకు వచ్చింది అమరావతి. చట్టబద్ధత సైతం కచ్చితంగా జరిగి తీరుతుందని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అబాసుపాలు కావడం ఖాయమని కూటమి చెబుతోంది. మరోవైపు అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వివాదాన్ని ఎండ్ కార్డు చూపించడమే మంచిదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి ఎవరి మాట వినే రకం కాదు కదా అనే వ్యాఖ్యలు వైసీపీలోనే సీనియర్లు వ్యాఖ్యానించే పరిస్థితి ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో…