Homeక్రీడలుక్రికెట్‌India Vs Pakistan Record Views: ఇండియా వర్సెస్ పాకిస్తాన్: రికార్డు బ్రేకింగ్ వ్యూస్!

India Vs Pakistan Record Views: ఇండియా వర్సెస్ పాకిస్తాన్: రికార్డు బ్రేకింగ్ వ్యూస్!

India Vs Pakistan Record Views: క్రికెట్లో టీమిండియా, పాకిస్తాన్ ఎప్పుడు తలపడినా కూడా ఉత్కంఠ తారస్థాయిలో ఉంటుంది. ప్లేయర్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుంటారు. కొన్ని సందర్భాలలో ఆటగాళ్ల మధ్య మాటలు తూటల మాదిరిగా పేలుతూ ఉంటాయి. దీనికి తోడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. క్రికెట్ మ్యాచ్ ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుంది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో టీమిండియాతో ఆడబోమని పాకిస్తాన్ ప్రకటించింది. ఆ తర్వాత అనేక నాటకీయ […]

India Vs Pakistan Record Views: క్రికెట్లో టీమిండియా, పాకిస్తాన్ ఎప్పుడు తలపడినా కూడా ఉత్కంఠ తారస్థాయిలో ఉంటుంది. ప్లేయర్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతుంటారు. కొన్ని సందర్భాలలో ఆటగాళ్ల మధ్య మాటలు తూటల మాదిరిగా పేలుతూ ఉంటాయి. దీనికి తోడు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో.. క్రికెట్ మ్యాచ్ ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుంది.

ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో టీమిండియాతో ఆడబోమని పాకిస్తాన్ ప్రకటించింది. ఆ తర్వాత అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి పాకిస్తాన్ తలవంచక తప్పలేదు. ఐసీసీ విధించిన షరతులకు లొంగక తప్పలేదు. ఫలితంగా పాకిస్తాన్ టీమిండియాతో ఆడాల్సి వచ్చింది. ఆదివారం కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది.

బ్యాటింగ్.. బౌలింగ్.. ఫీల్డింగ్ విభాగాలలో టీమ్ ఇండియా ప్లేయర్లు సంచలనం సృష్టించారు. తద్వారా టీమిండియా ఐసీసీ నిర్వహించే టోర్నీలలో పాకిస్తాన్ మీద తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది. సహజంగానే టీమిండియా, పాకిస్తాన్ ఆడుతుంటే రేటింగ్స్ బీభత్సంగా నమోదు అవుతుంటాయి. ఈసారి కూడా రికార్డు స్థాయిలో బ్రేకింగ్ వ్యూస్ నమోదయ్యాయి.

కొలంబోలో జరిగిన ఈ మ్యాచ్లో రికార్డులు బద్దలు కావడమే కాదు.. సరికొత్త ఘనతలు నమోదయ్యాయి. జియో హాట్ స్టార్ లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఫలితంగా ఈ వరల్డ్ కప్ లో అత్యధికమంది చూసిన మ్యాచ్ గా ఇది నిలిచింది. ఈ మ్యాచ్ ను చాలామంది అభిమానులు మొబైల్ ఫోన్లలో.. టీవీలలో చూసి ఆనందించారు. మరోవైపు అమెరికాతో టీమిండి ఆడిన మ్యాచ్ కు 26 కోట్లు.. నమీబియాతో జరిగిన మ్యాచ్ కు 24 కోట్ల వ్యూస్ లభించాయి..

“టీమిండియా ఆడుతుంటే ఆటోమెటిక్ గా వ్యూస్ నమోదు అవుతూ ఉంటాయి. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా అదరగొట్టిన నేపథ్యంలో.. వీక్షకులు తమ ఫోన్లకు.. టీవీలకు అతుక్కుపోయారు. అందువల్లే ఈ స్థాయిలో వ్యూస్ లభించాయి. టీమిండియా ఆడుతుంటే చాలు.. వ్యూస్ గురించే ఆలోచించాల్సిన అవసరం లేదని” జియో హాట్ స్టార్ ప్రతినిధులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper