Homeక్రీడలుక్రికెట్‌Australia Vs Sri Lanka: ఇంటికేనా.. ఆస్ట్రేలియా సూపర్ 8 కు కష్టమే.. సమీకరణాలివే

Australia Vs Sri Lanka: ఇంటికేనా.. ఆస్ట్రేలియా సూపర్ 8 కు కష్టమే.. సమీకరణాలివే

Australia Vs Sri Lanka: ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని శాసిస్తున్న ఆస్ట్రేలియా జట్టు ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో దారుణమైన ఆట తీరు ప్రదర్శిస్తోంది. ఆస్ట్రేలియా జట్టులో భీకరమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. ఆశించిన స్థాయిలో ఆడలేక పోతున్నారు. బ్యాటింగ్.. బౌలింగ్ విభాగాలలో విఫలమవుతున్నారు.

ఆస్ట్రేలియా స్థాయికి జింబాబ్వే ముందు ఓడిపోయింది అంటే.. ఆ జట్టు ప్లేయర్లు ఎలా ఆడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.. టి20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా ఇలా ఆడుతుందని.. గ్రూప్ దశ నుంచి ఇంటికి వెళుతుందని ఎవరూ ఊహించలేదు.. ఒకప్పుడు వరుస విజయాలతో.. ప్రత్యర్థులతో సంబంధం లేకుండా ఆస్ట్రేలియా సెమీ ఫైనల్, ఫైనల్ వెళ్ళేది. అద్భుతమైన పోరాట పటిమను చూపించి విజేతగా నిలిచేది.

ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో సరిగా ఆడలేక.. ఇతర జట్ల విజయాలు.. ఇతర సమీకరణాల ఆధారంగా సూపర్ 8 కు వెళ్లడానికి ఆస్ట్రేలియా ఎదురుచూస్తోంది. సోమవారం నాటి మ్యాచ్లో శ్రీలంక చేతిలో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత.. ఆస్ట్రేలియా జట్టుకు టి20 వరల్డ్ కప్ లో సూపర్ 8 దశకు వెళ్లే దారులు దాదాపుగా మూసుకుపోయాయి. అయితే మంగళవారం మూడు మ్యాచ్ లు జరుగుతున్న నేపథ్యంలో.. ఆస్ట్రేలియా భవితవ్యం తేలనుంది.

మంగళవారం ఉదయం 11 గంటలకు న్యూజిలాండ్, కెనడా, మధ్యాహ్న 3 గంటలకు ఐర్లాండ్, జింబాబ్వే, సాయంత్రం ఏడు గంటలకు స్కాట్లాండ్, నేపాల్ జట్లు తలపడతాయి. ఐర్లాండ్ జట్టుపై జింబాబ్వే కనక గెలిస్తే ఆస్ట్రేలియా ఈ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ జింబాబ్వే గనుక ఓడిపోతే ఆస్ట్రేలియా సూపర్ 8 దశకు చేరుకుంటుంది. ఇప్పటికే స్కాట్లాండ్, నేపాల్ జట్లు ఈ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, టీమిండియా, శ్రీలంక సూపర్ 8 దశకు చేరుకున్నాయి. భారత్ సూపర్ 8 పోరు లో భాగంగా తన తొలి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా తో ఆడుతుంది.

ఆస్ట్రేలియా జట్టు ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని మొత్తం శాసించిన నేపథ్యంలో.. అభిమానులు ఈ స్థాయి ప్రదర్శనను ఊహించలేకపోతున్నారు. ఆటగాళ్లు ఇలా ఆడతారని అంచనా వేయలేకపోతున్నారు. ఈసారి ఆస్ట్రేలియా జట్టులో బలమైన ప్లేయర్లో ఉన్నప్పటికీ.. ఐకమత్యం లోపించింది. క్రీడా స్ఫూర్తి కనిపించడం లేదు. అందువల్లే ఆటగాళ్లు అంతగా ఆకట్టుకోలేకపోతున్నారు. ఫలితంగా ఆస్ట్రేలియా జట్టుకు వరుసగా ఓటములు ఎదురవుతున్నాయి. అంచనా వేయలేని పరాభవాలు ఆస్ట్రేలియా జట్టును కుంగ్త తీస్తున్నాయి..

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular