Homeక్రీడలుక్రికెట్‌India Vs England T20 World Cup Semi Final: ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా:...

India Vs England T20 World Cup Semi Final: ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా: హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయంటే?

India Vs England T20 World Cup Semi Final: టి20 వరల్డ్ కప్ లో భాగంగా ముంబైలో గురువారం జరిగే మ్యాచ్ ద్వారా టీమ్ ఇండియా, ఇంగ్లాండ్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోబోతున్నాయి. ఈ రెండు జట్లలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా బీభత్సమైన ఫామ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగే మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి. Also Read: విజయ్–రష్మిక పెళ్లి రిసెప్షన్.. ప్రముఖుల సందడి.. వైరల్ పిక్స్ టి20 […]

India Vs England T20 World Cup Semi Final: టి20 వరల్డ్ కప్ లో భాగంగా ముంబైలో గురువారం జరిగే మ్యాచ్ ద్వారా టీమ్ ఇండియా, ఇంగ్లాండ్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోబోతున్నాయి. ఈ రెండు జట్లలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. వీరంతా బీభత్సమైన ఫామ్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగే మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అంచనాలు వినిపిస్తున్నాయి.

Also Read: విజయ్–రష్మిక పెళ్లి రిసెప్షన్.. ప్రముఖుల సందడి.. వైరల్ పిక్స్

టి20 ప్రపంచ కప్ లో ఇప్పటివరకు టీమిండియా, ఇంగ్లాండ్ ఐదుసార్లు ముఖాముఖి పోటీ పడ్డాయి. ఇందులో భారత్ మూడుసార్లు విజయం సాధించింది. ఇంగ్లాండ్ రెండు సందర్భాలలో గెలుపు అందుకుంది.

టి20 వరల్డ్ కప్ ప్రారంభమైన 2007వ సంవత్సరంలో ఇంగ్లాండ్, భారత్ దర్బార్ వేదికగా గ్రూప్ దశలో పోటీపడ్డాయి. ఈ మ్యాచ్ మొత్తం హోరాహోరీగా సాగింది. అయితే చివరికి టీమిండియాలో విజయం వరించింది. 18 పరుగుల
తేడాతో టీమిండియా గెలుపును అందుకుంది. టీ మీడియా స్టార్ అతగాడు యువరాజ్ సింగ్ ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్ బౌలింగ్లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టాడు. 12 బంతుల్లోనే మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ చేశాడు.

2009లో ప్రపంచ కప్ సూపర్ 8 పోరులో ఇంగ్లాండ్ ఉత్కంఠ భరితమైన విజయాన్ని సాధించింది. టీమిండియా పై మూడు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. లార్డ్స్ వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. ఇంగ్లాండ్ విధించిన 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా అధిగమించలేకపోయింది.

ఇక 2022 వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో భారత జట్టును ఇంగ్లాండ్ దారుణంగా ఓడించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా పూర్తి చేసింది.

2022లో ఎదురైన ఓటమికి టీమిండియా అద్భుతంగా బదులు తీర్చుకుంది. 2024 ప్రపంచ కప్ సెమి ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఇంగ్లాండ్ జట్టును ఓడించింది. 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2022 వరల్డ్ కప్ లో సెమీస్ లో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది.

ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్లో అందరి దృష్టి మొత్తం సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ మీద ఉంది. వీరు ముగ్గురు ముంబై జట్టులో కీలకమైన ప్లేయర్లు. బలంగా బ్యాటింగ్ చేయడంలో.. సిద్ధహస్తులు. హార్దిక్ పాండ్యా సరైన అందుకుంటే టీమ్ ఇండియాకు తిరుగు ఉండదు. మరోవైపు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన లయను అందుకోవాలి. సంజు శాంసన్ తన ఫామ్ మరోసారి కొనసాగిస్తే టీమిండియా భారీ స్కోర్ చేయడం ఖాయం. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ సత్తా చూపిస్తే టీమిండియా స్కోర్ బోర్డ్ రాకెట్ వేగంతో దూసుకుపోతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper