Homeఆంధ్రప్రదేశ్‌TDP New High Power Committee: టిడిపిలో కొత్తగా నిఘా..!

TDP New High Power Committee: టిడిపిలో కొత్తగా నిఘా..!

TDP New High Power Committee: ఏ పార్టీకైనా అంతర్గత వ్యవహారాలపై ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. పార్టీలో తెరవెనుక జరిగే పరిణామాలను గమనించాలి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు ఇది చాలా అవసరం కూడా. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే పనిలో ఉంది. ఆ పార్టీ ఆది నుంచి అదే ఫార్ములాను అనుసరిస్తోంది. ఎప్పటికప్పుడు పార్టీ ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు ఒక హై పవర్ కమిటీ( high power committee ) పని చేస్తూ ఉంటుంది. […]

TDP New High Power Committee: ఏ పార్టీకైనా అంతర్గత వ్యవహారాలపై ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. పార్టీలో తెరవెనుక జరిగే పరిణామాలను గమనించాలి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలకు ఇది చాలా అవసరం కూడా. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే పనిలో ఉంది. ఆ పార్టీ ఆది నుంచి అదే ఫార్ములాను అనుసరిస్తోంది. ఎప్పటికప్పుడు పార్టీ ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు ఒక హై పవర్ కమిటీ( high power committee ) పని చేస్తూ ఉంటుంది. అయితే ఈసారి లోకేష్ నేతృత్వంలో ఒక పవర్ ఫుల్ టీం రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇటీవల తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఓకింత ఆందోళనకు కారణమవుతున్నాయి. పార్టీలో చిన్న పార్టీ విభేదాలు వస్తే భూతద్దంలో పెట్టి పనిలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. ఆపై ప్రధాన మీడియా సైతం టిడిపి పై వ్యతిరేక ప్రచారం చేస్తోంది. కూటమి రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న ఈ తరుణంలో జాగ్రత్తలు తీసుకోకుంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని లోకేష్ కు తెలుసు. అందుకే పార్టీ తెర వెనుక జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు నాయకత్వానికి తెలియజెప్పే ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: విజయ్–రష్మిక పెళ్లి రిసెప్షన్.. ప్రముఖుల సందడి.. వైరల్ పిక్స్

* తెర వెనుక పరిణామాలపై..
పార్టీలో క్రమశిక్షణ కమిటీ( discipline committee ) ఒకటి ఉంది. అయితే కేవలం ఫిర్యాదులపై దర్యాప్తు చేయడమే కాకుండా.. తెర వెనుక జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలియజెప్పే వీలుగా ఈ హై పవర్ కమిటీ ఇకనుంచి పనిచేయనుంది. ఏ జిల్లాలో లోపాలు ఉన్నాయి? నేతల మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? వాటికి పరిష్కార మార్గం ఏంటి? ఈ విభేదాలకు కారణాలు ఏంటి? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఉందా? పార్టీలో కోవర్టులు ఉన్నారా? వంటి వాటిపై ఈ కమిటీ దృష్టి పెడుతుంది.

* ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ..
ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు( mantana Satyanarayana Raju ) నేతృత్వంలో ఒక కమిటీ ఉంది. ఈ కమిటీ సైతం కార్యకర్తల మనోభావాలను ఎప్పటికప్పుడు తెలుసుకొనుంది. అయితే ఇది నేరుగా పనిచేస్తుంది. కానీ తెర వెనుక జరిగే పరిణామాలను అంచనా వేసి ఎప్పటికప్పుడు నాయకత్వానికి సమాచారం ఇచ్చే మరో కమిటీ కూడా ఉంటుంది. ఒకవేళ టిడిపి నేతల మధ్య విభేదాలు వస్తే అప్పటికప్పుడు పరిష్కారం, ఆపై దిద్దుబాటు చర్యలు వంటివి చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ హైపర్ కమిటీ చాలా రహస్యంగా తన పని తాను చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే అదొక నిఘా కమిటీ అన్నమాట.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper