Homeక్రీడలుFIFA 2026: తొలి మ్యాచ్లోనే మూడు రెడ్ కార్డులు.. ఆ రిఫరీకే ప్లేయర్ ఆఫ్ ది...

FIFA 2026: తొలి మ్యాచ్లోనే మూడు రెడ్ కార్డులు.. ఆ రిఫరీకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇచ్చేయండి..

FIFA 2026: ఫిఫా వరల్డ్ కప్ ఘనంగా మొదలైంది. మెక్సికో వేదికగా అట్టహాసంగా ప్రారంభ వేడుకలు జరిగాయి. తొలి మ్యాచ్లో ఆతిధ్య మెక్సికో జట్టు ఘనవిజయం సాధించింది. దక్షిణాఫ్రికా మీద 2-0 తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఈ గెలుపు ద్వారా మెక్సికోలో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది.. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా జట్టు మీద చాలామంది అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మ్యాచ్ రిఫర్. మెక్సికో, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో […]

FIFA 2026: ఫిఫా వరల్డ్ కప్ ఘనంగా మొదలైంది. మెక్సికో వేదికగా అట్టహాసంగా ప్రారంభ వేడుకలు జరిగాయి. తొలి మ్యాచ్లో ఆతిధ్య మెక్సికో జట్టు ఘనవిజయం సాధించింది. దక్షిణాఫ్రికా మీద 2-0 తేడాతో సూపర్ విక్టరీ నమోదు చేసింది. ఈ గెలుపు ద్వారా మెక్సికోలో ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది.. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా జట్టు మీద చాలామంది అభిమానులు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మ్యాచ్ రిఫర్.

మెక్సికో, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రిఫరీగా విల్టన్ వ్యవహరించాడు. అయితే దక్షిణాఫ్రికా ప్లేయర్లకు ఇతడు మూడు రెడ్ కార్డులు ఇచ్చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా ఓవటానికి ప్రధాన కారణంగా వ్యవహరించిన విల్టన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం ఇవ్వాలని అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. అతడి మీద మీమ్స్ రూపొందించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ప్రారంభ మ్యాచ్ లోనే ఈ స్థాయిలో రెడ్ కార్డులు జారీ చేయడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దక్షిణాఫ్రికా జట్టుకు చెందిన ఇద్దరు ప్లేయర్లకు నేరుగా రెడ్ కార్డ్ జారీ చేయడంతో.. కేవలం 9 మంది ప్లేయర్లతోనే దక్షిణాఫ్రికా ఆడాల్సి వచ్చింది.

2022లో ఫిఫా వరల్డ్ కప్ జరిగింది. మొత్తం ఆటోనిలో కేవలం నాలుగు రెడ్ కార్డులు మాత్రమే జారీ అయ్యాయి. అయితే ఈ సీజన్లో తొలి మ్యాచ్ లోనే మూడు రెడ్ కార్డులు ఇవ్వడం విశేషం. ఒక మ్యాచ్లో ఎన్ని రెడ్ కార్డులు ఇవ్వడం ఒక వింత అయితే.. ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఇవ్వడం ఇదే మొదటిసారి. అయితే ఈసారి జరిగే ఫిఫా కప్ లో రెడ్ కార్డుల జారీ మరింత పెరుగుతుందని అభిమానులు చెబుతున్నారు.

సాధారణంగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు నిబంధనలు పాటించని ఆటగాడికి రిఫరీ రెడ్ కార్డ్ ఇస్తూ ఉంటాడు. ఆటగాడికి రెండుసార్లు ఎల్లో కార్డులు జారీ చేయాల్సి ఉంటుంది. అప్పటికి అతని ప్రవర్తన మారకపోతే రెడ్ కార్డు ఇస్తుంటారు. ఆ తర్వాత ఆ ఆటగాడు మైదానంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు. మరొకరితో అతడి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం కూడా ఉండదు. కొన్ని సందర్భాలలో రెడ్ కార్డు ఎదుర్కొనే ప్లేయర్ పై తర్వాతి మ్యాచ్లో నిషేధం విధించే అవకాశం కూడా ఉంటుంది. ఇదంతా కూడా రిఫరీ చేతుల్లోనే ఉంటుంది. మెక్సికో.. దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్లో మాత్రం ముగ్గురు ప్లేయర్లకు ఒక్కసారి కూడా ఎల్లో కార్డు జారీ చేయలేదు. నేరుగా రెడ్ కార్డు చూపించడం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారి తీస్తోంది. దీనిపై ఫిఫా నిర్వాహకులు ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. చూడాలి మరి.. నిర్వాహకులు ఏం చెబుతారో..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper