Homeక్రీడలుక్రికెట్‌Chennai Vs Rajasthan: చెన్నై జట్టుకు చేతబడి జరిగిందా.. అందువల్లే ఇంతటి పరాజయమా

Chennai Vs Rajasthan: చెన్నై జట్టుకు చేతబడి జరిగిందా.. అందువల్లే ఇంతటి పరాజయమా

Chennai Vs Rajasthan: చెన్నై జట్టు ఓడిపోయింది. గత సీజన్ తో పోల్చి చూస్తే అద్భుతమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. చెన్నై జట్టు రాజస్థాన్ ముందు తలవంచింది. 2026 సీజన్ తొలి మ్యాచ్లోనే దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొంది. వాస్తవానికి ఈ స్థాయిలో ఓటమి ఎదురవుతుందని చెన్నై జట్టు అభిమానులు కలలో కూడా ఊహించలేదు. Also Read: అమరావతి రైతుల బాధను గుర్తించిన విజయసాయిరెడ్డి చెన్నై జట్టు 2026 సీజన్ కు సంబంధించి జరిగిన మెగా వేలంలో సమర్థవంతమైన ప్లేయర్లను […]

Chennai Vs Rajasthan: చెన్నై జట్టు ఓడిపోయింది. గత సీజన్ తో పోల్చి చూస్తే అద్భుతమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. చెన్నై జట్టు రాజస్థాన్ ముందు తలవంచింది. 2026 సీజన్ తొలి మ్యాచ్లోనే దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొంది. వాస్తవానికి ఈ స్థాయిలో ఓటమి ఎదురవుతుందని చెన్నై జట్టు అభిమానులు కలలో కూడా ఊహించలేదు.

Also Read: అమరావతి రైతుల బాధను గుర్తించిన విజయసాయిరెడ్డి

చెన్నై జట్టు 2026 సీజన్ కు సంబంధించి జరిగిన మెగా వేలంలో సమర్థవంతమైన ప్లేయర్లను కొనుగోలు చేసింది. వారికి భారీగానే ముట్ట చెప్పింది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. చెన్నై జట్టుకు టోర్నీ ప్రారంభానికి ముందు కష్టాలు వరుసగా రావడం మొదలైంది. ముందుగా స్పెన్సర్ జాన్సన్ గాయపడ్డాడు. అతని స్థానంలో ఎల్లిస్ ను తీసుకున్నారు. చివరికి అతడు కూడా గాయపడ్డాడు.. భీభత్సంగా బ్యాటింగ్ చేస్తాడు అనుకునే బ్రేవిస్ గాయపడ్డాడు. ప్రారంభ మ్యాచ్లకు దూరమవుతాడని మేనేజ్మెంట్ చెబుతున్నప్పటికీ.. అతడికి అయిన గాయం తీవ్రంగానే ఉందని వార్తలు వస్తున్నాయి. ఇక చెన్నై జట్టుకు మాస్టర్ మైండ్ అయిన ధోని కూడా గాయపడ్డాడు. అతడు దాదాపు రెండు వారాల వరకు మైదానంలో అడుగుపెట్టే అవకాశం లేదు . ఇటువంటి దురదృష్టకరమైన సంఘటనలు ఐపీఎల్ లో మరే జట్టుకు ఎదురు కాలేదు.

ఇలా వరుసగా చెడు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో చెన్నై జట్టుకు ఎవరైనా చేతబడి చేశారా అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి నేటి కాలంలో చేతబడి చేయడానికి అవకాశం లేదు. చేతబడిని నమ్మేవారు కూడా ఎవరూ లేరు. కాకపోతే చెన్నై జట్టు ఇలా వరుసగా చెడు వార్తలు వినడం.. కీలకమైన ఆటగాళ్లు గాయపడడం వంటివి ఆ జట్టు అభిమానులను బాధపెడుతున్నాయి. చెన్నై జట్టులో గత రెండు సీజన్లతో పోల్చి చూస్తే అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. అయినప్పటికీ ఈసారి కూడా అదే ఇబ్బంది ఎదురవుతుండడం అభిమానులకు మింగుడు పడడం లేదు.

“మా జట్టు ఐదుసార్లు విజేతగా నిలిచింది. ధోని నాయకత్వంలో ఐపీఎల్ లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించింది. పెద్ద పెద్ద జట్లకు సైతం చుక్కలు చూపించింది. ఐదు ట్రోఫీలు అందుకొని ముంబై జట్టుకు సమానంగా నిలిచింది. అటువంటి మా జట్టు ఇప్పుడు ఇలాంటి ఓటములను ఎదుర్కొంటున్నది. జట్టు ఓడిపోవడం చూస్తుంటే బాధ కలుగుతున్నది. మా జట్టు ఒక పట్లగా ఆడాలి. ఐపీఎల్ లో తన విజయప్రస్థానాన్ని కొనసాగించాలని..” చెన్నై జట్టు అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper