Homeక్రీడలుక్రికెట్‌CSK Poor Performance: చైన్నై సూపర్ కింగ్స్.. ఇంత చెత్తగానా..ధోని జట్టేనా ఇది

CSK Poor Performance: చైన్నై సూపర్ కింగ్స్.. ఇంత చెత్తగానా..ధోని జట్టేనా ఇది

CSK Poor Performance: దారుణం.. అత్యంత నాసిరకం.. దరిద్రం.. ఇలా ఎన్ని ఉపమానాలు ఉంటే.. అన్ని ఉపమానాలు వాడొచ్చు. ఎందుకుంటే చెన్నై జట్టు ఆటతీరు అంతదారుణంగా ఉంది మరి.. బౌలింగ్లో దారుణం.. బ్యాటింగ్లో అత్యంత చెండాలం.. ఏదీ బాగోలేదు. ఎటు చూసినా బాగోలేదు. ఇలా ఆడతారని.. ఇంతలా ఓడిపోతారని సగటుఎల్లో అభిమాని ఊహించి ఉండరు. అందువల్లే మ్యాచ్ జరుగుతుండగానే ఓటమిని అంచనా వేసి ఫోన్లు చూడటం మొదలు పెట్టారు. ఎందుకంటే ఆ సమయంలో వారిబాధను దూరం చేసింది […]

CSK Poor Performance: దారుణం.. అత్యంత నాసిరకం.. దరిద్రం.. ఇలా ఎన్ని ఉపమానాలు ఉంటే.. అన్ని ఉపమానాలు వాడొచ్చు. ఎందుకుంటే చెన్నై జట్టు ఆటతీరు అంతదారుణంగా ఉంది మరి.. బౌలింగ్లో దారుణం.. బ్యాటింగ్లో అత్యంత చెండాలం.. ఏదీ బాగోలేదు. ఎటు చూసినా బాగోలేదు. ఇలా ఆడతారని.. ఇంతలా ఓడిపోతారని సగటుఎల్లో అభిమాని ఊహించి ఉండరు. అందువల్లే మ్యాచ్ జరుగుతుండగానే ఓటమిని అంచనా వేసి ఫోన్లు చూడటం మొదలు పెట్టారు. ఎందుకంటే ఆ సమయంలో వారిబాధను దూరం చేసింది ఆ ఫోన్ మాత్రమే.

చైన్నై జట్టు ఐపీఎల్ లో ఐదుసార్లు విజేత. అన్ని సార్లూ ధోని నాయకత్వంలోనే చెన్నై జట్టు విజేతగా నిలిచింది. కానీ, గడిచిన మూడు సీజన్లుగా చైన్నై జట్టు దారుణంగా ఆడుతోంది. అభేద్యమైన రికార్డులు కలిగి ఉన్నఎల్లో ఆర్మీ ప్రత్యర్థి జట్లకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతోంది. పరుగులుతీయలేకపోతోంది. పరుగులను అడ్డుకోలేకపోతోంది. ఇలా ఆడుతున్న జట్టును చూసి అభిమానులు నిర్వేదం వ్యక్తంచేస్తున్నారు. ఇలా ఆడితే ఎలా భాసూ అంటూ సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తంచేస్తున్నారు.

ప్రస్తుత సీజన్ లో ప్లే ఆఫ్ వెళ్లాలంటే గెలవాల్సిన మ్యాచ్ లలో చైన్నై వరుసగా ఓడిపోయింది. అసలు ఆ జట్టు అలా ఎందుకు ఆడిందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. నాయకత్వ లేమి, ఆటగాళ్లలో ఐకమత్యం లోపించడం వల్ల చైన్నై జట్టు వరుస ఓటములు ఎదుర్కొని టోర్నీ నిష్క్రమించింది.దీంతో సగటు చెన్నై అభిమాని గుండి పగిలింది. చైన్నైజ ట్టు వరుసగా ప్లే ఆఫ్ ముందు గ్రూప్ దశ నుంచి ఎగ్జిట్ అవడం ఇది మూడో సారి. అదికూడా వరుసగా..

2023లో విజేతగా నిలిచింది చైన్నై. ఆ తర్వాత సీజన్ 2024లో ట్రోఫీ అందుకోలేకపోయింది. గ్రూప్ దశ నుుంచే బయటకు వెళ్లిపోయింది. 2025లో ఇదే సీన్ రిపీట్అయింది. ప్రస్తుత సీజన్ లో కూడా గ్రూప్ దశ నుంచి ఇంటికి వెళ్లింది. చైన్నై జట్టు వరుసగా ప్లే ఆఫ్ వెళ్లకుండా ఇంటికి వెళ్లడం ఇది వరుసగా మూడో సారి. మరి వచ్చే సీజన్ లోఅయినా చైన్నై మెరుగ్గా ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper