Homeక్రీడలుక్రికెట్‌Rohith Sharma : మైదానంలో హిట్ మ్యాన్.. మైదానం వెలుపల కామన్ మ్యాన్.. రోహిత్ చేసిన...

Rohith Sharma : మైదానంలో హిట్ మ్యాన్.. మైదానం వెలుపల కామన్ మ్యాన్.. రోహిత్ చేసిన పనికి సర్వత్రా ప్రశంసల జల్లు

Rohith Sharma :  రోహిత్ శర్మకు దూకూడైన బ్యాటర్ అనే పేరు ఉంది. మైదానంలోనూ ఆవేశంగా ఉంటాడనే అపవాదు కూడా ఉంది. అయిప్పటికీ వాటిని రోహిత్ పట్టించుకోడు. జట్టు కోసం మాత్రమే ఆడతాడు. జట్టును గెలిపించాలని మాత్రమే దూకుడైన బ్యాటింగ్ ను కొనసాగిస్తాడు. అందువల్లే అతడికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఐపీఎల్ లో ముంబై జట్టు యాజమాన్యం నుంచి పక్కకు తప్పించగానే.. దేశం మొత్తం ఆగ్రహం వ్యక్తం అయింది. సోషల్ మీడియాలో రోహిత్ పేరు మారుమోగిపోయింది. ఇక ఇటీవల టీం ఇండియాకు టి20 వరల్డ్ కప్ అందించడంలో రోహిత్ శర్మ కీలక పాత్ర పోషించాడు. దాదాపు 17 ఏళ్ల తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ సాధించడంతో రోహిత్ నామస్మరణతో దేశం దద్దరిల్లిపోయింది.. అయితే రోహిత్ ఒక అభిమాని కోసం చేసిన పని ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారి తీస్తోంది. దానికి సంబంధించిన వీడియో ఓ వ్యక్తి తన ఫోన్ లో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త విస్తృతం అయిపోయింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..

టీమిండియా కెప్టెన్ (టి20 లు కాదు) రోహిత్ శర్మ తనకు ఇష్టమైన లాంబోర్గిని కారులో చక్కర్లు కొడుతున్నాడు. ముంబై వీధులలో సందడి చేస్తున్నాడు. పైగా ఇప్పుడు బంగ్లాదేశ్ జట్టుతో టీమిండియా టి20 సిరీస్ ఆడుతోంది. టి20 లకు రోహిత్ వీడ్కోలు పలకడంతో అదటికి విశ్రాంతి లభించింది. దీంతో రోహిత్ సరదాగా గడుపుతున్నాడు. తన విలాసవంతమైన లాంబోర్గిని కారులో విహరిస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ మహిళ అభిమాని కోసం కారు ఆపి.. ఆమెతో కరచాలనం చేశాడు. కారులో కూర్చొని అతడు ఫోటోలకు ఫోజ్ ఇచ్చాడు. ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో తెగ చక్కర్లు కొడుతోంది. ” రోహిత్ శర్మకు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అందువల్లే అతడిని అభిమానులు విపరీతంగా ఆరాధిస్తారు. అతడి ఆట తీరు బాగుంటుంది. దూకుడుకు సిసలైన ప్రతీకగా నిలుస్తుంది. అందువల్లే అతని చాలామంది అభిమానిస్తుంటారు. అటువంటి అభిమాని కోసం అతడు కారు ఆపి శుభాకాంక్షలు తెలియజేశాడు. అది అతడి గొప్పతనాన్ని తెలియజేస్తుంది. గతంలో తనను చూసేందుకు ఓ అభిమాని మైదానంలోకి రాగా.. రోహిత్ భయపడ్డాడు. ఆ తర్వాత తేరుకొని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది అతడిని కొట్టడానికి ప్రయత్నిస్తే. రోహిత్ వారించాడు. ఇప్పుడు ఏకంగా తన కారును ఆపి తన అభిమానికి శుభాకాంక్షలు తెలియజేశాడు. రోహిత్ హిట్ మాన్ మాత్రమే కాదు, కామన్ మ్యాన్ కూడా అని” సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Today 22 July 2026 Horoscope

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...
Oktelugu Epaper