క్రీడలుక్రికెట్‌Anderson Tendulkar Test Series: అండర్సన్ - టెండూల్కర్ టెస్ట్ సిరీస్ .. సుదీర్ఘ ఫార్మాట్...

Anderson Tendulkar Test Series: అండర్సన్ – టెండూల్కర్ టెస్ట్ సిరీస్ .. సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్ కు సరికొత్త పాఠాలు చెప్పింది..

Anderson Tendulkar Test Series: టి20 దుమ్ము రేపుతోంది. వన్డే అదరగొడుతోంది. ఇలాంటి కాలంలో టెస్ట్ క్రికెట్ ఎవరు చూస్తారు? అసలు అన్ని రోజులపాటు సాగే ఆటను కళ్ళు అప్పగించుకొని మరి చూసే వారెవరు? ఈ ప్రశ్నకు అండర్సన్ – టెండూల్కర్ సిరీస్ ప్రారంభానికి ముందు సమాధానం లేదు. కానీ ఇకపై ఆ ప్రశ్న వేసే అవకాశం లేదు. ఎందుకంటే టెస్ట్ క్రికెట్లో సొగసును.. టెస్ట్ క్రికెట్లో అందాన్ని.. టెస్ట్ క్రికెట్లో కనిపించే అసలు సిసలైన ఆటను అండర్సన్ – టెండూల్కర్ సిరీస్ రుచి చూపించింది. ఈ సిరీస్ లో మ్యాచ్ జరిగాయి. ఒక మ్యాచ్ డ్రా అయింది. అయితే డ్రా అయిన విధానం కూడా అద్భుతంగా ఉంది. దానిని డ్రా అనడం కంటే పోరాట స్ఫూర్తి అని చెప్పడం సబబు. ఆ పోరాట స్ఫూర్తిని ప్రదర్శించి టీమిండియా అదరగొట్టింది. అదే ఊపులో చివరి టెస్టులో ఆరు పరుగుల తేడాతో గెలిచి.. అద్భుతం సాధించింది.

Also Read: బుమ్రా ను మర్చిపోండి భయ్యా.. ఇకపై సిరాజే మన రేసుగుర్రం..

సాధారణంగా టెస్ట్ క్రికెట్ ఐదు రోజుల పాటు సాగుతుంది. కాకపోతే అన్ని మ్యాచ్లు ఐదు రోజుల పాటు సాగవు. కొన్ని మూడు రోజులలోనే ముగుస్తాయి. మరికొన్ని నాలుగు రోజుల్లో సమాప్తం అవుతాయి. అలాంటప్పుడు చూసే వాళ్లకు అంతగా క్రికెట్ ఆనందం లభించదు. అయితే అండర్సన్ టెండూల్కర్ సిరీస్ మాత్రం అద్భుతమైన క్రికెట్ ఆనందాన్ని అభిమానులకు అందించింది. దాదాపు 25 రోజులపాటు సాగిన ఐదు టెస్టుల సిరీస్ అసలు సిసలైన క్రికెట్ మజాను అందించింది. ఇప్పట్లో ఈ సిరీస్ ను ఏ ఆటగాడు మాత్రమే కాదు అభిమాని కూడా మర్చిపోడు. ఎందుకంటే ఆ స్థాయిలో కిక్ ఇచ్చింది.. ప్రతి మ్యాచ్ కూడా ఐదు రోజులపాటు సాగి టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించింది.

2000 సంవత్సరం నుంచి ఇప్పటివరకు పరిశీలిస్తే కేవలం నాలుగు సిరీస్ లలో మాత్రమే మ్యాచులు ఐదు రోజుల పాటు సాగాయి. అందులో 2001లో వెస్టిండీస్ వేదికగా వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో ప్రతి మ్యాచ్ ఐదు రోజుల పాటు సాగింది.

2004-05 కాలంలో దక్షిణాఫ్రికా వేదికగా సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ తలపడిన సిరీస్లో.. ప్రతి మ్యాచ్ కూడా ఐదు రోజులపాటు సాగింది.

2017 -18 కాలంలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా వేదికగా తలపడ్డాయి. ప్రతి మ్యాచ్ కూడా ఐదు రోజుల పాటు సాగింది.

ప్రస్తుత ఏడాదిలో అండర్సన్ టెండుల్కర్ సిరీస్ లో భాగంగా.. ఇంగ్లాండ్, ఇండియా ఇంగ్లాండ్ వేదికగా ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడాయి. ఇందులో తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది. రెండవ మ్యాచ్ ఇండియా గెలిచింది. మూడో మ్యాచ్ ఇంగ్లాండ్ గెలిచింది. నాలుగో మ్యాచ్ డ్రా అయింది. ఐదో మ్యాచ్ ఇండియా గెలిచింది. అయితే ప్రతి మ్యాచ్ కూడా ఐదు రోజుల పాటు సాగింది. ఐదవ టెస్ట్ మాత్రమే ఐదో రోజు తొలి సెషన్ లో ముగిసింది. మిగతా అన్ని కూడా చివరి వరకు సాగాయి. ఒకరకంగా రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడిన నేపథ్యంలో.. అభిమానులకు అద్భుతమైన క్రికెట్ ఆనందం లభించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Eng Vs Ind 5th Test: క్లీన్ స్వీప్ నుంచి రికార్డులు బద్దలు కొట్టేదాకా.. టీమిండియా యంగ్ ప్లేయర్ల ప్రస్థానం సాగిందిలా..

Eng Vs Ind 5th Test: అనుభవం లేదు. అన్నిటికంటే జట్టులో విరాట్, రోహిత్, అశ్విన్ లేరు. ఇంగ్లాండేమో బలంగా కనిపిస్తోంది.. బౌలింగ్లో భీకరంగా ఉంది. బ్యాటింగ్లో అద్భుతంగా ఉంది. ఫీల్డింగ్లో సంచలనాలు...

Eng Vs Ind 5th Test Mohammed Siraj: శభాష్ సిరాజ్.. తండ్రి కష్టానికి గుర్తింపు తెచ్చావ్.. దేశాన్ని సగర్వంగా నిలబెట్టావ్!

Eng Vs Ind 5th Test Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్.. సోషల్ మీడియా మొత్తం ఇతడి నామస్మరణతో మారుమోగుతోంది. ప్రధాన మీడియా ఇతడి చుట్టూ తిరుగుతోంది. ఇక డిజిటల్ మీడియా గురించి...

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
FIFA World Cup 2026

FIFA World Cup 2026: వాటర్ బాటిల్ 500.. చికెన్ ఫ్రై 1800.. ఈ రేట్ల వెనుక ఉన్న...

FIFA World Cup 2026: మనం ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తే ఎంత ఖర్చు పెడతాం.. మహా అయితే 20.. ఇంకాస్త ప్రీమియం అనుకుంటే 30.. ఇంకా బాగా ప్రీమియం అనుకుంటే...
Trump FIFA Club World Cup

Trump FIFA Club World Cup: నీ ప్రచార పిచ్చి తగలెయ్య.. ఫిఫా కప్ లో అమెరికా అధ్యక్షుడు...

Trump FIFA Club World Cup: ప్రజా జీవితంలో ఉన్న వాళ్లకు ప్రచారం కచ్చితంగా కావాలి. వాళ్లు చేసే చిన్న పని అయినా సరే.. అందరికీ తెలియాలి. అందువల్లే నేటి కాలంలో...
Rohit Sharma

Rohit Sharma: రిటైర్మెంట్ పై తొలిసారి నోరు విప్పిన రోహిత్.. క్లారిటీ ఇచ్చేశాడుగా..

Rohit Sharma: "అతడి వయసు 40 కి దగ్గరగా వచ్చింది. అంతగా ఆడలేడు. ఐపీఎల్ లో సత్తా చూపించలేకపోయాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టలేకపోతున్నాడు. అతడు రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చింది....
Oktelugu Epaper