Eng Vs Ind 5th Test: అనుభవం లేదు. అన్నిటికంటే జట్టులో విరాట్, రోహిత్, అశ్విన్ లేరు. ఇంగ్లాండేమో బలంగా కనిపిస్తోంది.. బౌలింగ్లో భీకరంగా ఉంది. బ్యాటింగ్లో అద్భుతంగా ఉంది. ఫీల్డింగ్లో సంచలనాలు నమోదు చేస్తోంది. పైగా వారికి బజ్ బాల్ క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆడుతోంది వారి సొంతమైన మైదానాలలో.. అలాంటప్పుడు యువ జట్టు ఇంగ్లాండ్ ను ఓడించలేదు.. ఓడించే అవకాశం లేదు.. సిరీస్ క్లీన్ స్వీప్ అవుతుంది. చూస్తూ ఉండండి.. ఇవీ ఇంగ్లాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ప్రారంభానికి ముందు వినిపించిన వ్యాఖ్యలు.. విశ్లేషణలు..
Also Read: శభాష్ సిరాజ్.. తండ్రి కష్టానికి గుర్తింపు తెచ్చావ్.. దేశాన్ని సగర్వంగా నిలబెట్టావ్!
అయితే వాటన్నింటినీ పక్కనపెట్టి యువ ఇండియా జట్టు అదరగొట్టింది. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు ఎదుట దాసోహం అవ్వకుండా భీకరమైన ఆట తీరు ప్రదర్శించింది. రెండు టెస్టులు ఓడిపోయి.. రెండు టెస్టులు గెలిచి.. సిరీస్ ను ఈక్వల్ చేసింది. అంతేకాదు ఇంగ్లాండ్ జట్టుకు ఐదో టెస్టులో దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. గెలుపు దశలో ఉన్న ఆ జట్టుకు చివర్లో భారత బౌలర్లు కోలుకోలేని ట్రీట్మెంట్ ఇచ్చారు. ఫలితంగా టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అయితే ఈ విషయంలో మాత్రమే కాదు.. ఈ సిరీస్ మొత్తంలో టీమిండియా ప్లేయర్లు ఆకట్టుకున్నారు. అనితర సాధ్యమైన ప్రదర్శనతో అదరగొట్టారు.
ఈ సిరీస్లో టీమిండియా సారధి దాదాపు 800 పరుగులు చేశాడు. టాప్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. అతని తర్వాత కే ఎల్ 532, జడ్డూ 516, రిషబ్ 479, జైస్వాల్ 411, సుందర్ 284 పరుగులతో తర్వాతి స్థానాలలో ఉన్నారు. సిరాజ్ 23 వికెట్లతో లీడింగ్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్నాడు. ఆ తర్వాత జస్ భాయ్ 14, ప్రసిద్ద్ కృష్ణ 14, ఆకాశ్ 13 వికెట్లు సాధించారు.. ఈ సిరీస్ గెలుచుకోలేకపోయినప్పటికీ.. టీమిండియా అద్భుతమైన పోరాటంతో సమం చేసుకుంది. ప్రత్యర్థి గెలుస్తుందనుకున్నచోట .. తన మార్క్ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించి విజయం సాధించింది టీమిండియా యంగ్ జట్టు.