Zodiac Signs: హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ అక్షయ తృతీయను శుభకరంగా భావిస్తారు. ఈ రోజున అన్ని కూడా మంచి పనులను ప్రారంభిస్తారు. ఏదైనా పనిని ప్రారంభించడం వల్ల రెట్టింపు ఫలితం ఉంటుందని నమ్ముతారు. అయితే ఈ అక్షయ తృతీయ నాడు ఎక్కువగా బంగారం వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఎందుకంటే అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవిని ఎక్కువగా పూజిస్తారు. దీంతో బంగారం, వెండి వంటి వాటిని కొనుగోలు చేయడం వల్ల సంపద వృద్ధి చెందుతుందని నమ్ముతారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ అక్షయ తృతీయ రోజు నుంచి కొన్ని రాశుల వారికి అంతా కూడా మంచే జరగనుంది. నిజం చెప్పాలంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు వృద్ధి చెందుతుంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయని నిపుణులు అంటున్నారు. అయితే ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.
Also Read: 14ఏళ్ల పిల్లాడు కదా.. ఔట్ కాగానే ఏడ్చుకుంటూ వెళ్లాడు.. వైరల్ ఫోటో
వృషభ రాశి
అక్షయ తృతీయ నుంచి ఈ రాశి వారికి అంతా కూడా మంచే జరగనుందని పండితులు చెబుతున్నారు. ఈ రాశి వారికి ముఖ్యంగా లక్ష్మీదేవి, కుబేరుడు ఆశీర్వాదం లభిస్తుందట. దీంతో ఏ పని చేపట్టినా కూడా అంతే విజయమే లభిస్తుంది. ఎలాంటి సమస్యలు అయినా కూడా తీరిపోతాయి. ఇప్పటి వరకు జీవితంలో వచ్చిన సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. విద్య, ఉద్యోగం, వ్యాపారం అన్నింట్లో కూడా విజయం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు తీరిపోయి.. డబ్బు వృద్ధి చెందుతుందని పండితులు అంటున్నారు. అలాగే వాహనాలు, ఆస్తులు వంటివి కొనుగోలు చేస్తారు.
మీన రాశి
మీన రాశి వారికి కూడా ఈ అక్షయ తృతీయ నుంచి అదృష్టం వరించబోతుంది. ఇప్పటి వరకు ఉన్న సమస్యలు అన్ని కూడా తీరిపోతాయని పండితులు అంటున్నారు. వీరు ఈ ఏడాది ఇల్లు, వాహనాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే పెండింగ్ పనులు అన్ని కూడా పూర్తి అవుతాయి. ఇకపై ఎలాంటి సమస్యలు అయినా కూడా క్లియర్ అవుతాయి. ముఖ్యంగా ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం వస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తీరుతాయి. లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల ఎలాంటి సమస్యలు అయినా కూడా ఇట్టే తీరుతాయి.
మిధున రాశి
మిధున రాశి వారికి ఇప్పటి వరకు ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఇకపై ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. ఈ అక్షయ తృతీయతో వారికి అదృష్టం పట్టబోతుంది. ఆర్థిక పరంగా సమస్యలు అన్ని కూడా తీరుపోతాయి. ఇకపై వారికి అన్ని విధాలుగా కూడా మంచి జరగనుంది. ఉద్యోగం, వ్యాపారంలో బాగా కలసి వస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఈ రాశి వారికి లక్ష్మీదేవి కరుణిస్తుంది. ఇకపై డబ్బు వీరి సొంతం అవుతుంది. కోటీశ్వరుడు అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని పండితులు అంటున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugunews.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.
Also Read: అప్పుడు ఢిల్లీ.. ఇప్పుడు లక్నో.. రాజస్థాన్ దరిద్రాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతుందేమో?