Homeఆధ్యాత్మికంGuru Brihaspati : గురువు బృహస్పతి కారణంగా ఈ రాశుల వారికి ధనమే ధనం..

Guru Brihaspati : గురువు బృహస్పతి కారణంగా ఈ రాశుల వారికి ధనమే ధనం..

Guru Brihaspati : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి వాటిలో బృహస్పతి ఒకటి. బృహస్పతి నీ గురువుగా భావిస్తారు. ఈ గ్రహం అనుకూలత ఉంటేనే వివాహం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఈ గ్రహం ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అన్ని శుభాలు జరుగుతాయి. నీచ స్థితిలో ఉంటే మాత్రం కొన్ని పనులు అసలు పూర్తి కావు. అయితే అక్టోబర్ 31 వరకు ఈ గ్రహం కొన్ని […]

Guru Brihaspati : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి వాటిలో బృహస్పతి ఒకటి. బృహస్పతి నీ గురువుగా భావిస్తారు. ఈ గ్రహం అనుకూలత ఉంటేనే వివాహం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది. ఈ గ్రహం ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు అన్ని శుభాలు జరుగుతాయి. నీచ స్థితిలో ఉంటే మాత్రం కొన్ని పనులు అసలు పూర్తి కావు. అయితే అక్టోబర్ 31 వరకు ఈ గ్రహం కొన్ని రాశుల వారి విషయంలో ఉచ్చ స్థితిలో ఉండనుంది. దీంతో ఆ రాశుల వారికి అనేక ప్రయోజనాలు జరగనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవంటే?

సింహం:
సింహ రాశి వారికి అక్టోబర్ 31 లోపు అన్ని శుభ ఫలితాలే జరగనున్నాయి. సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకునే వారికి అనువైన మార్గం ఏర్పడుతుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారు. అయితే ఈ కాలంలో వీరికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.

వృషభం:
ఈ రాశి వారికి గురువు బృహస్పతి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. దీంతో గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు జరపడం వల్ల అధిక లాభాలు ఉంటాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. అయితే అనవసరపు హామీలు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు డబ్బు ఇవ్వడం కూడా మానుకోవాలి.

ధనుస్సు:
ఈ రాశి వారి వ్యాపారంలో గురువు అష్టమ స్థితిలో ఉంటాడు. దీంతో ఆకస్మిక ధన లాభం ఉంటుంది. వ్యాపారంలో రాబడి పెరుగుతుంది. ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. అయితే సొంత వాళ్లే మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

తుల:
ఈ రాశి వారికి ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. అనవసరంగా ఎవరికి వాగ్దానాలు ఇవ్వకుండా చూడాలి. ఇతరులకు డబ్బు ఇవ్వడం కానీ.. లేదా అప్పు తీసుకోవడం కానీ చేస్తే జాగ్రత్తలు పాటించాలి. వృత్తి ఉద్యోగాల విషయంలో పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. వ్యాపారులు ఆదాయం మీద ఎక్కువగా దృష్టి పెడతారు. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండడమే మంచిది.

మకరం:
ఈ రాశి వారు ఆర్థిక వ్యవహారాల నిర్మాణంలో జాగ్రత్తగా ఉండాలి. దానధర్మాలు చేయడం వల్ల సమాజంలో గుర్తింపు పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల అండదండలతో వ్యాపారాలు అధిక లాభాలు పొందుతారు. ఆర్థిక వ్యవహారాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు.

కుంభం:
ఈ రాశి వారికి గురువు బృహస్పతి గ్రహం అనుకూలత ఉంటుంది. దీంతో అదనంగా ఆదాయాన్ని పొందుతారు. సొంత విషయాలను బయట పెట్టకుండా ఉండాలి. కొందరు పక్కనే ఉండి మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు ఇతరులకు అప్పగించద్దు. వ్యాపారులు ప్రత్యర్థులపై కన్నీసి ఉంచాలి.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper