Ananya Raj: చిన్న వయసులోనే ఎంతో మంది యంగ్ హీరోయిన్లు , హీరోలు చనిపోవడం ఇండస్ట్రీ లో కొత్తేమి కాదు. కెరీర్ ఇప్పుడిప్పుడే ఊపండుంటుంది అని అనుకునే సమయానికి మరణించడం అనేది కేవలం వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే కాదు , అభిమానులకు , ప్రేక్షకులకు కూడా చాలా బాధకు గురి చేస్తోంది. రీసెంట్ గా ఒక యంగ్ హీరోయిన్ విషయం లో ఇదే జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రముఖ యంగ్ హీరోయిన్ అనన్య రాజ్ కన్నుమూసింది. తెలుగు , హిందీ భాషల్లో అనేక సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోయిన్ గా యూత్ లో మంచి పేరు తెచ్చుకున్న ఈ 27 ఏళ్ళ హీరోయిన్ , గత నెల 15 వ తేదీన , తెల్లవారుజామున , నిద్రలోనే తన తుది శ్వాసని విడిచింది , ఆమె కుటుంబ సభ్యులు నేడు మీడియా కి తెలియజేసారు.
ఈ వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి రావడం తో , ఆమె అభిమానులు , సినీ పరిశ్రమకు చెందిన వారు ఒక్కసారిగా శోకసంద్రం లో మునిగిపోయారు. గత ఏడాది కాలం నుండి ఆమె శారీరకంగా , మానసికంగా ఎన్నో ఇబ్బందులను ఎదురుకుంటూ వస్తుందట. వాటిని అధిగమిస్తూ , ఒక వీరవనిత లాగానే ఆమె పోరాడింది అట. కానీ దురదృష్టం కొద్దీ విధి రాసిన తలరాత ప్రకారం ఆమెని మమ్మల్ని వదిలి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందంటూ కుటుంబ సభ్యులు తీవ్రమైన విచారం వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు , మీడియా ఈ అంశం పై మాకు వ్యక్తిగత గోప్యత ఇవ్వాలని , మేమంతా తీవ్రమైన విచారం లో ఉన్నామంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు కుటుంబ సభ్యులు. ఈ ఏడాది మే నెల వరకు సోషల్ మీడియా లో అనన్య రాజ్ చాలా యాక్టీవ్ గా ఉంటూ వచ్చింది.
ఇన్ స్టాగ్రామ్ లో తనకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు రెగ్యులర్ గా అప్లోడ్ చేస్తూ ఉండేది. అకస్మాత్తుగా ఆమె ఇన్ యాక్టీవ్ అవ్వడం తో , అసలు అనన్య రాజ్ కి ఏమైంది అంటూ ఆమె అభిమానులు ఆరా తీయడం మొదలు పెట్టారు , కానీ ఎలాంటి సమాచారం అందలేదు , ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఇలా ఆమె మరణ వార్త గురించి చెప్పడం తో సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేశారు. అనన్యరాజ్ తెలుగు లో ‘తగ్గేదేలే ‘ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించింది. అంతకు ముందు ఎన్నో ప్రముఖ అంతర్జాతీయ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా చేసింది. అంతే కాకుండా బాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా , హీరోయిన్ గా చేసింది. ఇంత చిన్న వయస్సు లో ఆమెకు ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరం , ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.