Homeఆధ్యాత్మికంToday 7 February 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులు ఈరోజు నక్క తోక తొక్కినట్లే..

Today 7 February 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులు ఈరోజు నక్క తోక తొక్కినట్లే..

Today 7 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాశులపై చిత్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు వ్యాపారులకు అనుకూలమైన వాతావరణము ఉండడంతో లాభాలు అధికంగా వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. […]

Today 7 February 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశరాశులపై చిత్త నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు వ్యాపారులకు అనుకూలమైన వాతావరణము ఉండడంతో లాభాలు అధికంగా వస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. ఇరుగుపొరుగు వారితో మాటల మాధుర్యంతో ఆకట్టుకుంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండగలుగుతారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి వారు ఇంటికి సంబంధించి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త వాహనాలు కొనుగోలు చేసే సమయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద తొలగిపోతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు ఉండవు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. తెలివైన వ్యక్తులను కలుస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు కొత్త భాగస్వాములు పరిచయమవుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. స్నేహితుల నుంచి ధన సహాయమందుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది. జీవిత భాగస్వామితో సంతోషమైన జీవితం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారి కుటుంబ జీవితం ఈరోజు సంతోషంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టేవారు సమయాన్ని అనుకూలంగా మలుచుకుంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు పదోన్నతి వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులకు ఒత్తిడి తగ్గుతుంది. ఇంట్లో పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. వివాహానికి సంబంధించి శుభవార్తలు వింటారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : . ఈ రాశి వ్యాపారులకు ఈరోజు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దుబారా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఆచితూచి వ్యవహరించాలి. పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థుల నైపుణ్యం ప్రదర్శించడంతో గురువుల నుంచి ప్రశంసలు అందుతాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు చేసే ప్రతి పనిని ఇతరులు మెచ్చుకుంటారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారులు మెరుగైన లాభాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. రాజకీయాల్లో ఉంటే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థికంగా పుంజుకుంటారు. శత్రులపై విజయం సాధించడంతో సంతృప్తిగా ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . ఈ రాశి వారు ఈ రోజు చాలా సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో దూర ప్రయాణాలు చేస్తారు. సమాజంలో గౌరవం లభించడంతో అనుకున్న పనులు పూర్తవుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper