Homeఆధ్యాత్మికంToday 14 February 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు లక్కీ డే..

Today 14 February 2026 Horoscope: ఈ రాశి వ్యాపారులకు ఈరోజు లక్కీ డే..

Today 14 February 2026 Horoscope: జ్యోతిష శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై ఉత్తరాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వ్యాపారులకు ఈరోజు ఏదంటే అది జరుగుతుంది. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు అన్నీ సానుకూలమైన ఫలితాలు ఉండనున్నాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విద్యార్థుల కెరీర్ పై కీలక నిర్ణయం తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండడమే మంచిది. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారు పెద్దలను సంప్రదించడం మంచిది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఏ పని చేపట్టినా విజయవంతంగా పూర్తి అవుతుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. బంధువుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. సమాజంలో గౌరవం లభిస్తుంది. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): . ఈ రాశి వారు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో కొన్ని ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులు కొత్త భాగస్వామిలను చేర్చుకుంటారు. వీరితో అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఈ రాశి వారి వ్యాపారులకు ఈరోజు ధనయోగం కలగనుంది. గతంలో కంటే ఇప్పుడు లాభాలు పెరుగుతాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు ఉంటాయి. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఆదాయాన్ని పెంచుకునేందుకు చేసే ప్రయత్నాలు పలుస్తాయి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణము ఉండడంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారు ప్రియమైన వారితో సంతోషంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా గడుపుతారు. స్నేహితులతో సరదాగా ఉంటారు. ఉద్యోగులకు అధికారుల నుంచి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో సంయమనం పాటించాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొందరికి పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ రంగంలో పనిచేసే వారికి లాభాల పంట పంటనుంది. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వీరితో సంతోషంగా గడుపుతారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు వ్యాపారం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కొన్ని సమస్యలు ఎదురైనా కూడా వాటి నుంచి బయట పడేందుకు పరిష్కారం ఆలోచించాలి. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాడు. మాటలు మాట్లాడేటప్పుడు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి. ప్రత్యర్థుల విషయంలో అప్రమత్తంగా ఉండడమే మంచిది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు అన్ని రంగాల్లో రాణిస్తారు. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం చేసిన సక్సెస్ అవుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. దీంతో లాభాలు పొందుతారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారు బంధువుల నుంచి ధన ప్రయోజనం పొందుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టేముందు పెద్దలను సంప్రదించడం మంచిది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. ఇంటి నిర్మాణానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు వెళ్లడంతో సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి మద్దతు ఉంటుంది. పదోన్నతి గురించి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు చాలా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. కొత్తగా పనులు ప్రారంభించే వారు పెద్దలను సంప్రదించడం మంచిది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular