Homeఆధ్యాత్మికంToday 21 June 2026 Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు ఊహించని విజయాలు.. వ్యాపారులకు...

Today 21 June 2026 Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు ఊహించని విజయాలు.. వ్యాపారులకు డబ్బే డబ్బు..

Today 21 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై పూర్వ పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వరకు ఈరోజు ఊహించని విజయాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులకు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధికంగా లాభాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి సంబంధించి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు కొత్త వ్యక్తులను కలుస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం కరణీయంగా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. జీవిత భాగస్వామి సలహాతో వ్యాపారులు కొత్త పెట్టుబడును పెడతారు. ఇవి భవిష్యత్తులో అధిక లాభాలను తీసుకొచ్చే అవకాశాలుంటాయి.. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందేందుకు మార్గం ఏర్పడుతుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు మానసికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఏదైనా వస్తువు కొనుగోలు చేసే సమయంలో ఆలోచించాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు చేసే ప్రయత్నాలు అన్నింటిలో విజయం సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు పని భారం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో పూర్వీకులు ఆస్తికి సంబంధించి శుభవార్తను వింటారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : మీ రాశి వారు ఈ రోజు మానసికంగా సంతృప్తిగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. దీంతో సంతోషంగా ఉండగలుగుతారు. వ్యాపారులు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు పని భారం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఇదే మంచి సమయం. గతంలో ఆగిపోయిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే వ్యాపారులు పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. గతంలో కోల్పోయిన డబ్బులు ఇప్పుడు తిరిగి పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. దీంతో అనుకోని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : నిరుద్యోగుల నుంచి కొంత సమాచారం అందుతుంది. ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. ఉద్యోగులు కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. కొన్ని పనులు పూర్తి కావడానికి ఎటువంటి నిర్లక్ష్యంగా ఉండకూడదు. కష్టంగా ఉండే పనులను ఈరోజు ఇష్టంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఏర్పడతాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular