Homeఆధ్యాత్మికంToday 24 September 2025 Horoscope: అదనపు ఆదాయం కోసం చూసే ఈ రాశుల వారికి...

Today 24 September 2025 Horoscope: అదనపు ఆదాయం కోసం చూసే ఈ రాశుల వారికి శుభవార్త..

Today 24 September 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అదనపు ఆదాయ ప్రయోజనాలు ఉండనున్నాయి. మరి కొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : గతంలో చేపట్టిన పనులు పూర్తవుతాయి. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. వ్యాపారులు ఈరోజు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. అనుకున్న పని సమయానికి పూర్తి చేస్తారు. దీంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి సిద్ధమవుతారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : పెద్దల అండతో కొత్తగా పెట్టుబడులు పెడతారు. స్నేహితులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యపరమైన సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారులు భాగస్వాములతో కొత్త ప్లాన్ వేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉన్న వ్యాపారులకు లాభాలు అందుతాయి.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. వారికి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఉద్యోగులు గతంలో చేపట్టిన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. పరీక్షల్లో రాణించడానికి విద్యార్థులు కష్టపడాల్సి వస్తుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఆర్థిక పరిస్థితి దెబ్బతిని అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామి తో బాధలన్నీ ఉంటే అవకాశం. పెట్టుబడుల గురించి పెద్దలను సంప్రదిస్తారు. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. విద్యార్థులు ఎదుర్కొంటున్న అడ్డంకుల నుంచి బయట పడతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : కుటుంబంలో ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి సలహాతో వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. కొత్త వ్యాపారం పై ఆసక్తి కలుగుతుంది. సమస్యలు ఎదురైతే ధైర్యంతో ముందుకు వెళ్లాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : సోదరుల మధ్య ఉన్న విభేదాలు పెద్దగా మారుతాయి. ఇలాంటి సమయంలో మౌనంగా ఉండడమే మంచిది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులకు కొత్త ప్రాజెక్టులు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి కొత్తగా లాభాలు పొందే అవకాశం ఉంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : . ఈ రాశి వారు ఈ రోజు సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు సాధిస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరిగే అవకాశం ఉంది. చట్టపరమైన చిక్కులు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : రాజకీయాల్లో ఉండేవారికి ఈరోజు అనుకూలమైన వాతావరణం ఉంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో ఒత్తిడి తగ్గుతుంది. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. వ్యాపారులు శత్రువులపై విజయం సాధిస్తారు. ఇంటి అవసరాల కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం తగ్గుతుంది. ఇంట్లో సమస్యలు ఎదురైతే కోపాన్ని నియంత్రించుకోవాలి. పిల్లల భవిష్యత్తుపై చిలక నిర్ణయం తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : వ్యాపారాలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించాలి. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారం కోసం దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విద్యార్థులకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఆర్థికపరమైన లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. కొందరు మోసం చేసే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆదాయం పెరిగినా.. ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండాలి. ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకుంటే తిరిగి చెల్లించే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : సోదరుల మధ్య విభేదాలు ఉంటాయి. వ్యాపారాల్లో అధిక లాభాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఎవరితోనైనా వాదన జరిగితే మౌనంగా ఉండటమే మంచిది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper