Sriya Reddy OG Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ అతనికి మంచి ఐడెంటిటిని క్రియేట్ చేసి పెట్టాయి. మరి ఇలాంటి సందర్భాల్లో ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించే అవకాశాలైతే ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ లో కీలకమైన పాత్రను పోషిస్తున్నప్పటికి సమయం దొరికిన ప్రతిసారి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక నీకు అందులో భాగంగానే సుజీత్ దర్శకత్వంలో ఆయన చేసిన ఓజీ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఈరోజు నైట్ నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్స్ అయితే వేస్తున్నారు. మరి ఏది ఏమైనా కొద్ది గంటల్లోనే ఓజీ సినిమాకు సంబంధించిన టాక్ అయితే బయటకు రాబోతోంది. ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ కెరియర్ లో రానటువంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా అయితే తెరకెక్కుతోంది.
ఇక దానికి తోడుగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా కొత్తగా కనబడటమే కాకుండా తన అభిమానులను అలరించే విధంగా ఉన్నాడు…ఇక ఈ సినిమాలో శ్రేయా రెడ్డి సైతం ఒక పాత్రలో నటించింది. ఆమె గతంలో పొగరు అనే సినిమాలో విలన్ పాత్రను పోషించి మంచి గుర్తింపుని సంపాదించుకుంది. ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను మెప్పించింది.
ఇప్పుడు ఓజీ సినిమాలో ఆమె పాత్ర సినిమా మొత్తానికి హైలెట్ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆమె క్యారెక్టరైజేషన్ లో తీసుకున్న జాగ్రత్తలు కూడా చాలా బాగా ఎలివేట్ అయినట్టుగా తెలుస్తున్నాయి. మొత్తానికైతే ఆమె స్క్రీన్ మీద కనిపించి పవన్ కళ్యాణ్ గురించి డైలాగులు చెబుతున్నప్పుడు మాత్రం థియేటర్లో విజిల్స్ పడతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు అంటు సినిమా యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు…
ఇక ఆమె ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సోదరిగా నటించబోతుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ అజ్ఞాతం నుంచి బయటికి రావడానికి ఆమె క్యారెక్టర్ మూలమవుతుందని తన వల్లే ఔజాస్ గంభీర ముంబై కి వస్తాడని తెలుస్తోంది…