CM Vijay : తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన పెద్దమ్మ అమల్ రాజశేఖరన్ (92) వయోధిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం మరణించారు.
విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్ సోదరుడైన రాజశేఖరన్, ఆయన భార్య అమల్ రాజశేఖరన్ కొంతకాలంగా నీలాంకరైలోని ఒక వృద్ధాశ్రమంలో నివసిస్తున్నారు. వీరి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె విదేశాల్లో స్థిరపడటంతో వీరు నీలాంకరై వృద్ధాశ్రమంలోనే ఉంటున్నట్లు సమాచారం.
వయోభారంతో వచ్చిన ఆరోగ్య సమస్యల కారణంగా అమల్ రాజశేఖరన్ తుదిశ్వాస విడిచారు. వృద్ధాశ్రమంలో ఉంచిన ఆమె భౌతికకాయాన్ని శుక్రవారం రోజున ముఖ్యమంత్రి విజయ్, ఆయన తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్, తల్లి శోభ సందర్శించారు. అమల్ రాజశేఖరన్ భౌతికకాయానికి పూలమాలలు వేసి అశ్రునయనాల మధ్య నివాళులర్పించారు.
పెద్దమ్మ మృతిపట్ల సీఎం విజయ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు ప్రముఖులు, పార్టీ శ్రేణులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.