Lakshmi Devi blessings tips by Chanakya : సంపదకు దేవత లక్ష్మీదేవి అన్న సంగతి అందరికీ తెలిసిందే. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తాయి. అయితే మనిషికి కొన్ని చెడు అలవాట్లు ఉన్నట్లయితే ఎప్పటికి లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు అని ఆచార్య చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో తెలిపాడు. కాబట్టి ఇటువంటి చెడు అలవాట్లు ఉన్నట్లయితే వాటిని వెంటనే మానుకోవాలని ఆయన సూచిస్తున్నాడు. ఆచార్య చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి ఉపయోగపడే అనేక విషయాల గురించి వాటికి సంబంధించిన నియమాల గురించి ప్రస్తావించడం జరిగింది. మనిషి సంతోషంగా జీవించడానికి అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఆచార్య చాణిక్యుడు తన నీతి శాస్త్రంలో కొన్ని నియమాలను పొందుపరిచాడు. ఆచార్య చానిక్యుడు నీతి శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం మనిషి కష్టపడి పనిచేయడం అలాగే కొన్ని నియమాలు పాటించడం వలన ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు అని వివరించారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు కలుగుతుందని అలాగే ఆ కుటుంబం ఆనందంగా జీవిస్తుందని ఆచార్య చానిక్యుడు అంటున్నాడు. కానీ కొన్ని చెడు అలవాట్ల కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేరు అని అంటున్నాడు.
కాబట్టి ఇటువంటి అలవాట్లు ఉన్నట్లయితే వాటిని వెంటనే మానుకోవడం మంచిది అని ఆచార్య చాణిక్యుడు అంటున్నాడు. మరి ఆ చెడు అలవాట్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రంలో చెప్పిన దాని ప్రకారం ఎవరైనా తమ పదవిని దుర్వినియోగం చేయడం మంచి అలవాటు కాదు అని అంటున్నారు. ఇటువంటి అలవాటు ఉన్నవాళ్లకి ఎప్పటికీ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అని ఆచార్య చాణిక్యుడు అంటున్నాడు. కాబట్టి ఎవరికైనా ఇటువంటి అలవాటు ఉన్నట్లయితే వాళ్లు వెంటనే మానుకోవడం మంచిది అని ఆయన సూచిస్తున్నాడు. పదవిని దుర్వినియోగం చేసే అలవాటు ఉన్న వాళ్ళని లక్ష్మీదేవి ఇష్టపడదు అని చాణిక్యుడు అంటున్నాడు. అలాగే వేరొకరి డబ్బులు కోసం అత్యాశపడే వాళ్ళను కూడా లక్ష్మీదేవి ఇష్టపడదు. జీవితంలో బాగా కష్టపడి సంపాదించిన డబ్బులు మాత్రమే ఎక్కువ కాలం వరకు ఉంటాయి. కాబట్టి ఆచార్య చాణిక్యుడు చెప్పిన దాని ప్రకారం లక్ష్మీదేవి ఆశీస్సులు దురాశపరులకు లభించవు.
Also Read : లక్ష్మీ దేవి మీ ఇంట్లో ఉండాలంటే ఈ అలవాట్లు ఉండకూడదు..
ఇటువంటి చెడు అలవాటు కనక ఉన్నట్లయితే వెంటనే మానుకోవడం మంచిది. తప్పుడు సహవాసం కూడా మంచి అలవాటు కాదు. జీవితంలో ఏమైనా గొప్పగా సాధించాలి అనుకుంటే వాళ్ళు వెంటనే తప్పుడు వ్యక్తుల సహవాసాన్ని మానుకోవడం మంచిది. అప్పుడే వాళ్లకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే అనవసరంగా డబ్బులు ఖర్చు చేయడం వంటి వారిని కూడా లక్ష్మీదేవి ఇష్టపడదు. అవసరం లేకుండా ఎక్కువగా డబ్బులు ఖర్చు చేస్తే లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లు అవుతుంది. కాబట్టి డబ్బును ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ఉండాలి. ఇటువంటి వారి దగ్గర మాత్రమే లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుంది అని ఆచార్య చాణుక్యుడు అంటున్నాడు.