spot_img
Homeఆధ్యాత్మికంAkshaya Tritiya 2024: అక్షయ తృతీయ స్పెషల్ డీల్స్.. కారు కొనడం ఖాయం

Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ స్పెషల్ డీల్స్.. కారు కొనడం ఖాయం

Akshaya Tritiya 2024: భారత్ ఎన్నో సంస్కృతులు, సంప్రదాయాలకు పుట్టినిల్లు అన్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్నో ఆచారాలు ప్రజలు పాటిస్తుండగా.. పండుగలను, పర్వదినాలను ఎంతో ఘనంగా నిర్వహిస్తుంటారు. కాగా ఈ నెల 10వ తేదీన అక్షయతృతీయ రాబోతుంది. ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్న ఈ రోజున ఏదైనా కొత్త వస్తువు లేదా ఆస్తి వంటి వాటిని కొనుగోలు చేస్తే మంచిదని చాలా మంది నమ్మకం. ఈ క్రమంలోనే పలువురు బంగారం, ఇల్లు, కారు లేదా ఇతర వాహనాలు వంటి వాటిని కొంటుంటారు.

ఈ క్రమంలోనే మీరు కూడా రానున్న అక్షయ తృతీయకు కారును కొనాలనే యోచనలో ఉన్నారా?. అయితే మీకో బంఫర్ ఆఫర్.. ఏంటి అంత ఆఫర్ అనుకుంటున్నారా..??

అక్షయ తృతీయ -2024 ను పురస్కరించుకుని ఆటోమొబైల్ ఇండస్ట్రీ స్పెషల్ డీల్స్ ను అందించనుంది. ఇందులో భాగంగా కస్టమర్లను ఆకర్షించేందుకు బ్యాంకులు సైతం అతి తక్కువ వడ్డీ రేట్లకు వాహనాల మీద లోనులను ఆఫర్ చేస్తున్నాయి. దీంతో పాటుగా ప్రాసెసింగ్ ఛార్జీలపై కూడా భారీ డిస్కౌంట్ లను ప్రకటించాయి.

ఐసీఐసీఐ బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పలు ప్రముఖ బ్యాంకులు తక్కువ వడ్డీకి కారు లోనులను ఇస్తున్నాయి. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా సుమారు 8.70 శాతం నుంచి 9.10 శాతం వడ్డీతో నాలుగు సంవత్సరాల టెన్యూర్ కు రూ.పది లక్షల లోన్ లను అందిస్తున్నాయి.

భారత అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా పేరుగాంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కారు లోన్లపై 8.75 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తుంది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంకులు కూడా 8.75 శాతం వడ్డీ రేటుతో లోన్లు ఇస్తున్నాయి. దీనికి ప్రతినెలా ఈఎంఐ రూ.24,587 అవుతుందని తెలుస్తోంది.

తరువాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇది నాలుగు సంవత్సరాలకు 8.70 శాతం వడ్డీతో రూ.10 లక్షల వరకు కార్ల లోన్లను అందిస్తోంది. అంటే నెలకు రూ.24,565 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఇక బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ లోనుపై 8.85 శాతం వడ్డీని వసూలు చేస్తుండగా.. దీని ప్రకారం నెలకు ఈఎంఐ రూ.24,632 ఉంటుంది.

యాక్సిక్ బ్యాంక్ నాలుగు సంవత్సరాలకు 9.30 శాతం వడ్డీ రేటును కలిగి ఉంది. అంటే నెలకు రూ.24,835 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐసీఐసీఐ బ్యాంక్ నాలుగు ఏళ్ల వ్యవధికి రూ.10 లక్షల కారు లోనులపై 9.10 శాతం వడ్డీ విధిస్తోంది. ఈ క్రమంలో కస్టమర్ నెలకు రూ.24,745 చొప్పున ఈఎంఐ చెల్సించాల్సి వస్తుందని తెలుస్తోంది.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
Oktelugu Epaper