Homeఆధ్యాత్మికంAkshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ వెంటే...

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ రోజు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ వెంటే…

Akshaya Tritiya 2026: హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం తర్వాత వచ్చేది వైశాఖమాసం. సంస్కృతంలో దీనిని మాధవ మాసం అని అంటారు. ఆధ్యాత్మికంగా ఈ మాసం ఎంతో పవిత్రమైనది. వేదాలు, పురాణాలు ఈ మాసాన్ని పుణ్యమాసాంగా అభివర్ణించాయి. ఈ కాలంలో చేసే దానధర్మాలు ఎంతో పుణ్యఫలాలు అందిస్తాయని ఆధ్యాత్మికవాదులు చెబుతున్నారు. ఈ నెలలో అక్షయ తృతీయ అనే పవిత్రమైన రోజు కూడా వస్తుంది. అక్షయ తృతీయ రోజు దానం చేయడం వల్ల మరింత ఫలితాన్ని పొందే అవకాశం ఉందని అంటున్నారు. ఈ వైశాఖమాసం గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకారం అక్షయ తృతీయకు అత్యంత విశేషమైన స్థానం ఉంది. వైశాఖ మాసంలో వచ్చే ఈ రోజున సూర్యుడు మేషరాశిలో ఉండగా.. చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. ఇలా సూర్యచంద్రులు ఉచ్ఛస్థితిలో ఉండడంవల్ల ఈరోజున పరిపూర్ణమైన లక్ష్మీ కటాక్షం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అక్షయ తృతీయ అనగానే చాలామంది బంగారం కొనాలి అని అనుకుంటారు. అయితే ప్రస్తుతం బంగారం ధరలు విపరీతంగా ఉన్నాయి. ఈరోజు కచ్చితంగా బంగారం కొనాలని అప్పులు చేయకూడదు. అప్పుడు చేసి బంగారం కొనడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. స్తోమత లేని వారు బంగారం వైపు ఆలోచించకుండా ఉండడమే మంచిది.

అక్షయ తృతీయ రోజు దానధర్మాల చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. అయితే ఎలాంటి దానం చేయాలి? అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. ఈరోజు వేసవిలో వస్తుంది. అందువల్ల ఇప్పుడు నీటి కొరత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఇతరుల దాహాన్ని తీర్చేందుకు ఒక మట్టికుండను దానం చేయాలి. అయితే సాధారణంగా కాకుండా ఇందులో లవంగాలు, పచ్చ కర్పూరం వేసి అందులో నీటిని నింపి నీటి కుంటను దానం చేయడం వల్ల ఎంతోమంది దాహం తీరే అవకాశం ఉంటుంది. అలాగే వేసవి తాపాన్ని తట్టుకునేందుకు విసనకర్రలు, గొడుగు, చెప్పులు, చాపలు దానం చేయడం వల్ల గొప్ప పుణ్యం లభిస్తుందని అంటారు. ఈ సమయంలో ఆహార కొరత కూడా ఉంటుంది కాబట్టి బియ్యం, పప్పులు, కూరగాయలు దానం చేయడం వల్ల కూడా విశేష ఫలితాన్ని పొందుతారు.

అక్షయ తృతీయ రోజున కొత్త వ్యాపారం ప్రారంభించే వారికి అనుకూలమైన వాతావరణము ఉంటుంది. అలాగే వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఇదే మంచి సమయమని భావిస్తారు. ఏ పని అయినా అక్షయ తృతీయ రోజు ప్రారంభిస్తే వారికి విజయం చేకూరుతుందని ఆధ్యాత్మిక వాదులు చెబుతున్నారు. అలాగే ఈ మాసంలో నదుల్లో స్నానం చేయడం వల్ల ఎంతో పవిత్రంగా భావిస్తారు. పవిత్ర నదులైన గంగ, గోదావరి నదుల్లో స్నానం చేస్తే పాపాలు నశిస్తాయని భక్తుల నమ్మకం.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular