FILE - In this Dec. 2, 2016 file photo, Rohingya from Myanmar make their way in an alley at an unregistered refugee camp in Teknaf, near Cox's Bazar, a southern coastal district about, 296 kilometers (183 miles) south of Dhaka, Bangladesh. Amnesty International has warned Myanmar in a report released Monday, Dec. 19 that the actions of its military may constitute crimes against humanity, based on accounts of violence against the country's Muslim Rohingya minority. (AP Photo/A.M. Ahad, File)
)
పాతబస్తీలో రొహింగ్యాలు నిజంగా ఉన్నారా? ఉంటే అధికారికంగా వచ్చారా? అనధికారికంగా ఉంటున్నారా? ఈ ప్రశ్నలు కీలక చర్చకు దారి తీస్తున్నాయి. రొహింగ్యాలు ప్రధానంగా మయన్మార్ దేశంలోని రఖైన్ రాష్ట్రానికి చెందిన వారు. వీళ్లను ఆ దేశం తమ పౌరులుగా గుర్తించడం లేదు. పరిస్థితులు మరింత ముదిరి 2012లో రోహింగ్యాలపై మిలిటరీ చర్యలకు దిగింది మయన్మార్. దీంతో ఇల్లూ, వాకిలి వదిలి కట్టుబట్టలతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశ సరిహద్దులు దాటారు రొహింగ్యాలు. వీలైతే భూమార్గం, లేదంటే సముద్ర బాట పట్టారు. కొంతమంది బంగ్లాదేశ్‌లో అడుగు పెట్టారు. కొంతమంది మలేషియా, ఇండోనేషియా వైపు వెళ్లి స్థిరపడ్డారు. అయితే బంగ్లాదేశ్ మీదుగా కొంతమంది భారతదేశంలోకి కూడా ప్రవేశించారు. బంగ్లాదేశ్ నుంచి ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించటం, అటు నుంచి ఇతర రాష్ట్రాల్లోకి ప్రవేశించి స్థిరపడ్డారు. రొహింగ్యాలు ముస్లింలు కావడంతో ఆ వర్గం జనాభా ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వారు నివాసం ఉంటున్నారు. ముఖ్యంగా అసోం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, జమ్మూకశ్మీర్, తెలంగాణ, కేరళలో క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు.
Also Read: కేసీఆర్ కు భయపడే ఢిల్లీ నేతలు వస్తున్నారా.?
మయన్మార్ నుంచి వచ్చిన రొహింగ్యాలు శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి పాతబస్తీలో ప్రత్యేకంగా క్యాంపును ఏర్పాటు చేసింది. వీరికి ఐక్యరాజ్యసమితి శరణార్థి గుర్తింపు కార్డులు కూడా ఇచ్చింది. ఈ కార్డుపై వారి వివరాలతో పాటు గుర్తింపు కార్డు జారీ చేసిన తేదీ, ఎంత వరకు అనుమతి ఉంది అనే వరాలు పొందు పరిచి ఉంటాయి. నిర్ధారిత తేదీ తర్వాత కూడా ఇక్కడే కొనసాగితే అప్పుడు అక్రమంగా నివసిస్తున్నట్లు లెక్క. అయితే ముగింపు తేదీ కంటే ముందే రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకుని తిరిగి మరి కొంతకాలానికి అనుమతి సంపాదిస్తుంటారు. పాతబస్తీలోని బాలాపూర్, రాయల్ కాలనీల్లో వీళ్లు ఎక్కువగా ఉన్నారు. క్యాంపుల్లో కొంతమంది ఉంటే… చాలా అక్కడ కాకుండా పాతబస్తీలోని ఇతర ప్రాంతాల్లో అద్దెకు ఉంటున్నారు.
ట్రై కమిషనరేట్లతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన నేరాల్లో రోహింగ్యాలు నిందితులుగా ఉన్నారు. వారిలో చాలా మంది ఇప్పటి వరకు వాంటెడ్‌లుగా ఉన్నారు. రోహింగ్యాలపై ఇప్పటికే చాలా కేసులు ఉన్నాయని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. తప్పుడు సమాచారంతో ఓటర్ ఐడీ, ఆధార్, ఇతర గుర్తింపు కార్డులు పొందడం వంటివి చేశారని వారిపై కేసులు నమోదు చేశారు. నకిలీ గుర్తింపు కార్డులు, ఇతర నేరాలకు సంబంధించి రోహింగ్యాలపై 62 కేసులు నమోదయ్యాయి.
Also Read: ‘బండి’ నోట మధ్యంతర మాట!
ఇక హైదరాబాద్ లోని రోహింగ్యాలను, పాకిస్తానీలను ఏరివేస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ కు పాకిస్తానీలు, రోహింగ్యాలు వచ్చారంటే కేంద్ర నిఘా వైఫల్యం వల్లే చొర బడ్డారని టీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఆరేళ్లలో 40 వేల మంది అక్రమ చొర బాటుదారులు ప్రవేశిస్తూ ఉంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదొక రాజకీయ దుమారం అయ్యింది. రోహింగ్యాల వద్ద ఉన్న ఓటరు ఐడీలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని శిబిరాల్లో ఉన్నవారితోపాటు ఇతర ప్రాంతాల్లో ఉంటున్న రోహింగ్యాల సమాచారం సేకరించి వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో బాలాపూర్, బార్కస్, పహాడీషరీఫ్ తదితర ప్రాంతాల్లోని శిబిరాల్లో రోహింగ్యాలు తలదాచుకుంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం నగరంలో 5-6 వేల మంది రోహింగ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Rohingya hunt begins in hyderabad
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com