IPL 2025: ఐపీఎల్ జరుగుతున్నన్నీ రోజులు సోషల్ మీడియాలో సందడి మామూలుగా ఉండదు. మీమర్స్ తమ బుర్రకు పదును పెడుతూ రకరకాలుగా వీడియోలు రూపొందిస్తుంటారు. అవి బహుళ ప్రజాదరణ పొందుతూ ఉంటాయి. వాస్తవానికి ఐపీఎల్ మ్యాచ్ లు చూసిన తర్వాత.. మీమర్స్ రూపొందించిన వీడియోలు చూస్తే ఐపీఎల్ మీద మరింత క్రేజ్ పెరుగుతుంది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కేవలం ఇలాంటి వీడియోల వల్లే సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ గా మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చేతినిండా సంపాదిస్తూ.. దర్జాగా వెనకేసుకుంటున్నారు. ప్రస్తుత ఐపీఎల్ లో సోమవారం జరిగిన మ్యాచ్లో చెన్నై, ఆదివారం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్, శనివారం జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాలు సాధించడంతో ఇప్పుడు మీమర్స్ కు చేతినిండా పని దొరికింది.
Also Read: ధోని కళ్లు మూసుకొని కొట్టినా ఔట్.. అట్లుంటది మరీ.. వైరల్ వీడియో
జాతి రత్నాల సినిమా రిఫరెన్స్ గా..
హైదరాబాద్, చెన్నై, ముంబై విజయాలు సాధించడంతో మీమర్స్ కు చేతినిండా పని దొరికింది. దీంతో వారు జాతి రత్నాలు సినిమాను రిఫరెన్స్ గా తీసుకున్నారు. అందులో నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కనిపించిన సన్నివేశాలను..సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆపాదించారు. అంతేకాదు ఈ మూడు జట్లు గెలిచిన దృశ్యాలను జాతి రత్నాలు సినిమాకు జత చేస్తూ మీమర్స్ వీడియోలు రూపొందించారు.. అది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నది..” మొత్తానికి గెలవాల్సిన సందర్భాలలో హైదరాబాద్, ముంబై, చెన్నై విజయాలు సాధించాయి. ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకున్నాయి. తర్వాతి ప్రయాణాన్ని ఎలా సాగిస్తాయో తెలియదు కానీ.. ఇప్పటికైతే అభిమానులకు కాస్త సాంత్వన కలిగించాయి. ఇక మీమర్స్ కు కూడా ఆ మూడు జట్లు చేతినిండా పని కల్పించాయి. అందువల్లే సోషల్ మీడియాలో ఇప్పుడు అలాంటి వీడియోలు కనిపిస్తున్నాయి. చూసేవాళ్ళకు ఆనందాన్ని అందిస్తున్నాయి. అందువల్లే మీమర్స్ కచ్చితంగా ఉండాలి. అప్పుడే ఆటకు మరింత అందం వస్తుంది. చూడాలి అనే కోరికను మరింత పెంచుతుందని” నెటిజన్లు అంటున్నారు.
తదుపరి అవకాశాలు సజీవం
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు కీలకమైన మ్యాచ్ లలో విజయాలు సాధించడంతో ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకున్నాయి.. దీంతో ఆ జట్ల అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. చెన్నై ఐదుసార్లు విచేతగా నిలిచింది. ముంబై కూడా ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచింది. ఇక హైదరాబాద్ రెండుసార్లు విజేతగా నిలిచింది. గత సీజన్లో రన్న రప్ గా నిలిచింది. మొత్తంగా ఈ మూడు జట్లకు మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది. మరి ఈ సీజన్లో ఈ మూడు జట్లు తదుపరి మ్యాచ్లలో ఎలా ఆడతాయో చూడాల్సి ఉంది.
— Orange Reddy (@meowreddy) April 14, 2025