Kavya Maran : శనివారం పంజాబ్ పై వన్ సైడ్ గేమింగ్ స్పిరిట్ ను హైదరాబాద్ ప్రదర్శించింది. ఏకచత్రాధిపత్యంతో 8 వికెట్ల తేడాతో సూపర్బ్ విక్టరీ తన అకౌంట్లో వేసుకుంది. అంతేకాదు పాయింట్స్ టేబుల్ లో 8 వ ప్లేస్ కు దూసుకుపోయింది. అంతకుముందు హైదరాబాద్ 10వ ప్లేస్ లో ఉండేది. ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ చారిత్రాత్మక 141 రన్స్ చేశాడు. తన ఐపీఎల్ కెరియర్ లోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ జట్టుపై గ్రేట్ విక్టరీ సాధించిన తర్వాత కావ్య మారన్ మైదానంలో చిందులు వేసింది. అభిషేక్ శర్మ తల్లిదండ్రులను ఆలింగనం చేసుకుంది. వారు కూడా తమ ఆనందాన్ని కావ్య మారన్ తో పంచుకున్నారు.
Also Read : కనీసం 200 అయినా కొట్టండి రా.. కావ్య పాప ఫ్రస్టేషన్.. వైరల్ వీడియోలు
పంజాబ్ సెట్ చేసిన 246 రన్స్ లక్ష్యాన్ని చేజ్ చేయడంలో అభిషేక్ శర్మ, హెడ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా సూపర్ బ్యాటింగ్ చేశారు. అంతేకాదు పంజాబ్ బౌలర్ల ఆత్మస్థైర్యం దెబ్బతిన విధంగా నాక్ ప్రదర్శించారు. పంజాబ్ బౌలింగ్ లైన్ అప్ ను బ్రేక్ చేశారు. 40 బాల్స్ లో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ.. హైదరాబాద్ తరఫున సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్ గా ఆవిర్భవించాడు. గత సీజన్లో చిన్నస్వామి స్టేడియంలో బెంగళూరు జట్టుపై హెడ్ 39 బాల్స్ ఫేజ్ చేసి సెంచరీ కొట్టాడు. ఈ జంట వారి నిర్భయమైన, దూకుడు అయిన ఆటతీరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటతీరును సరికొత్తగా ప్రదర్శించారు.. 2013లో పూణే వారియర్స్ పై అప్పటి బెంగళూరు ఆటగాడు గేల్ 30 బాల్స్ లో సెంచరీ చేశాడు. ఈ రికార్డు ఇప్పటికి భద్రంగానే ఉంది. అభిషేక్ 55 బాల్స్ లో 141 రన్స్ స్కోర్ చేశాడు. ఇదే క్రమంలో హైదరాబాద్ తరఫున అత్యధిక పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ (131) రికార్డు బద్దలు కొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన భారతీయ ఆటగాడిగా నిలిచాడు. హైదరాబాద్ గెలిచిన తర్వాత కావ్య ఉత్సాహంతో ఎగిరి గంతులు వేసింది. అభిషేక్ శర్మ ఆటను చూసి మై మరిచిపోయింది. అభిషేక్ శర్మ తల్లిని గట్టిగా హగ్ చేసుకుంది.. మనం సాధించాం అన్నట్టుగా తన చేతులతో సంకేతాలు ఇచ్చింది.. అయితే కావ్య అభిషేక్ శర్మ తల్లిదండ్రులతో అలా ఉండడాన్ని చూసిన చాలామంది.. ఇంతటి బాండింగ్ ఎలా సాధ్యమని.. అంతర్ముకురాలిగా ఉండే కావ్య ఎలా ఉండడం గొప్ప విషయమని వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్ గెలిచిన తర్వాత కావ్య అలాగే గెంతులు వేస్తూ కనిపించింది.. తన ఆనందాన్ని హైదరాబాద్ జట్టులోని కీలక వ్యక్తులతో పంచుకుంది. వరుసగాఎదురైనా నాలుగు ఓటముల తర్వాత గెలుపు దక్కడంతో కావ్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Also Read : 300 లోడింగ్.. సన్ రైజర్స్ కు మొదటికే మోసం!
Kavya Maran congratulating Abhishek Sharma's family.
– Moment of the day! ❤️pic.twitter.com/BqlelGoXdu
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 12, 2025