Parliament Session : పార్లమెంట్ సమావేశాలు.. నిన్నటి నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజు యథాలాపంగా సమావేశాలు జరగనీయలేదు. కారణాలు ఏంటని చూస్తే.. ‘ఓట్ చోరీ’ అంటూ బీహార్ లో ప్రచారం చేస్తే కాంగ్రెస్ ను చావుదెబ్బ తీశారు జనాలు. ఐదు సీట్లకు కాంగ్రెస్ పడిపోయింది. ఇప్పటికైనా రాహుల్ గాంధీ బుద్ది తెచ్చుకోవాలి కదా.. దీనిపై ‘సుప్రీంకోర్టు’కు కాంగ్రెస్ వెళ్లగా కొట్టేసింది. రాజ్యాంగ బద్దంగా ‘ఎస్ఐఆర్’ న్యాయసమ్మతమేనని పేర్కొంది.
ఎస్ఐఆర్ మీద చర్చ కావాలి అని పార్లమెంట్ సమావేశాల స్పీకర్ మీటింగ్ లో కాంగ్రెస్ ప్రస్తావించి చర్చకు పెట్టాలి. ఓటు చోరీ ఉంటే కశ్మీర్ లో ‘కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న ‘నేషనల్ కాన్ఫరెన్స్’ ఎలా గెలిచింది. జార్ఖండ్ లో బీజేపీ కూటమి ఓడి జేఎంఎం ఎలా గెలిచింది. జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది.. ఓటు చోరీ జరిగితే జూబ్లిహిల్స్ లో కాంగ్రెస్ ఎలా గెలిచిందో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి కదా..
పశ్చిమ బెంగాల్ లోనూ ఓటర్లను ఏరిపారేయడం అంత ఈజీ కాదు. పెద్ద ఎత్తున బంగ్లాదేశీయలున్నారు. ఇక్కడ బీజేపీకి అంత ఈజీ కాదు. ఇవన్నీ తెలిసి కూడా కాంగ్రెస్ , తృణమూల్ పార్లమెంట్ ను అడ్డుకోవడం ఎంత వరకూ కరెక్ట్ అన్నది ఆలోచించుకోవాలి.
జనం వద్దన్నా సుప్రీంకోర్టు కొట్టేసినా మంకు పట్టు వీడని ప్రతిపక్షాల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.