Family Man Season 4: ఇండియాలో అత్యంత పాపులారిటిని సంపాదించుకున్న వెబ్ సిరీస్ ఏదైనా ఉంది అంటే అది ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ అనే చెప్పాలి. ఇప్పటివరకు మూడు సీజన్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ 4వ సీజన్ ఎప్పుడు వస్తుంది అంటూ దానికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సీజన్ ఎండ్ చేసిన విధానం కొంతమంది ప్రేక్షకులకు నచ్చలేదు. కారణం ఏంటి అంటే మూడోవ సీజన్ లో ఎదురైన సమస్యలకు పరిష్కారాన్ని చూపించకుండా దాన్ని అర్థంతరంగా ముగించినట్టుగా అనిపించింది. ముఖ్యంగా చివరి ఫైటింగ్ లో గాయాల పాలైన శ్రీకాంత్ తివారి బతికాడా లేదా బైక్ వేసుకొని పారిపోయిన రుక్మా (జైదీప్ ఆహ్లావత్) ఎటు వెళ్లిపోయాడు.
Also Read: స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై మొదటిసారి స్పందించిన మృణాల్ ఠాకూర్!
మీరా(నిమ్రత్ కౌర్) కి ఏమైంది అనే విషయాల పట్ల సరైన క్లారిటీ ఇవ్వలేకపోయారు. దాంతో ప్రేక్షకులు కొంతవరకు సాటిస్ఫై అవ్వలేకపోయారనే చెప్పాలి. ఇక రీసెంట్ గా ఈ సినిమా దర్శకులు అయిన రాజ్ అండ్ డీకే ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మూడోవ సీజన్ అనుకున్నప్పుడే దానిని రెండు పార్ట్లుగా చేయాలని నిర్ణయించుకున్నారట.
అందుకే పార్ట్ 3 ఎండింగ్ లో ఎలాంటి కన్ క్లూజన్ ఇవ్వలేదని చెప్పారు. ఇక ఫోర్త్ పార్ట్ లో వీటన్నింటికి సంబంధించిన కన్ క్లూజన్ ఇస్తామని తొందర్లోనే దానిని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తామంటూ వాళ్లు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ఇక ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అభిమానులకు చాలా బాగా చేరువైంది.
ముఖ్యంగా శ్రీకాంత్ తివారి పాత్రలో మనోజ్ బాజ్ పాయ్ సైతం మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాడు. మొదటి రెండు పార్టులు ప్రేక్షకులను అలరించాయి. వాటితో పోలిస్తే ఫ్యామిలీ మ్యాన్ 3 అంత ఎఫెక్టివ్ గా లేదంటూ కొన్ని విమర్శలు వచ్చినా కూడా శ్రీకాంత్ తివారి గా మనోజ్ బాజ్ పాయ్ చక్కటి పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇక ‘ఫ్యామిలీ మ్యాన్ 4’ ఎప్పుడు అనేది తొందర్లోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇస్తామని రాజ్ అండ్ డీకే క్లారిటీగా చెప్పారు… అలాగే మొదటి మూడు పార్టీలను సక్సెస్ ఫుల్ గా నిలిపినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు కూడా తెలియజేశారు…