Tirupati fake ghee scam: నిన్న ఏసీబీ నెల్లూరు కోర్టులో సీబీఐ సమర్పించిన రిమాండ్ రిపోర్టు చూస్తే.. 5 ఏళ్లు తిరుమల గుడిలో నెయ్యి కాకుండా వేరే పదార్థాలతో ప్రసాదాలు తయారు చేసినట్టు తేలింది. నెయ్యి లేదు.. బిల్లులు లేవు.. ఆ పదార్థాలు లేవు.. కానీ లడ్డూ తయారు చేశారు. ఉత్తరఖాండ్ దేవభూమిలో ఓ బాబా కంపెనీ తిరుమలకు పంపిణీ చేసినట్టుగా ఉంది. నెయ్యిలా కనిపించేందుకు కొన్ని కెమికల్స్, సింథటిక్ రసాయనాలు, నెయ్యి అని నమ్మించడానికి కొన్ని కెమికల్స్ వాడారని తేలింది. టెస్టుల్లో దారుణం బయటపడింది.
భోలేబాబా ఫామ్ కంపెనీ వైసీపీ అధికారంలోకి వచ్చాకనే ఉత్తరాఖండ్ లో మొదలైంది. ఆగస్టులో పరిశోధనల్లో ఇది నెయ్యి కాదని తేలాక బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. క్రిమినల్ చర్యలు తీసుకోలేదని సమాచారం.
ఏఆర్ కంపెనీ తక్కువ ధరకు నెయ్యి సప్లై చేస్తామని ముందుకొచ్చింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏఆర్ ఫుడ్స్ నెయ్యి నాలుగు ట్రక్కులను పరిశోధనలకు పంపి కల్తీ నెయ్యి అని తెలిసి టీటీడీ తిరస్కరించింది. ఈ నెయ్యిని తిరిగి టీటీడీకి సప్లై చేసే కంపెనీ వద్దకు తీసుకెళ్లి ఆ కంపెనీ ద్వారా మళ్లీ డౌట్ రాకుండా కెమికల్స్ కలిపి తిరుమలకు పంపారు.
తిరుమల కల్తీ నెయ్యిపై పవన్ పోరుబాట పట్టాడు. ఈ ప్రాయశ్చిత్త దీక్ష చేశాడు. అయితే పవన్ పై అవహేళన చేసిన వారు ఇప్పుడేం చెబుతారు? దీనిపై ‘రామ్ ’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.