Sukumar – Ram Charan new movie: సినిమా ఇండస్ట్రీ లో లెక్కల మాస్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ఇండస్ట్రీకి రాకముందు ఆయన లెక్కలు మాస్టారుగా పనిచేశాడు. దానివల్లే ఆయన్ని లెక్కల మాస్టర్ అంటారు. ఇక దాంతో పాటుగా ఆయన సినిమాలన్నీ ఒక పజిల్ లాగా ఉంటాయి. వాటిని సాల్వ్ చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆయన సినిమాల్లో హీరోలు సైతం ఇంటలిజెంట్ గా కనిపిస్తూ ప్రేక్షకుల ఐక్యూ లెవల్ ని టెస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి లెక్కలు మాస్టర్ ‘రంగస్థలం’ సినిమా నుంచి తన రూట్ మొత్తం మార్చాడు. మాస్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో మరొక సినిమా చేస్తున్నాడు. ఇక ‘పుష్ప’ సిరీస్ తో సూపర్ సక్సెస్ ని సాధించిన ఆయన ఇప్పుడు రామ్ చరణ్ తో చేస్తున్న సినిమా మీద భారీ ఫోకస్ పెడుతున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే గొప్ప విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా గొప్ప విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని చేస్తున్నారు. కానీ సుకుమార్ మాత్రం తనతో పాటు తన శిష్యులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ గొప్ప గురువుగా ఎదుగుతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ తో చేస్తున్న సినిమాలో విలన్ పాత్రకి చాలా ఇంపార్టెన్స్ ఉందట.
ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆ పాత్రను ఎవరు చేయబోతున్నారు అనే దానిమీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మేన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజశేఖర్ చేత ఈ క్యారెక్టర్ ని చేయిస్తే బాగుంటుందని సుకుమార్ భావిస్తున్నారట.
దానికి అనుగుణంగానే రాజశేఖర్ ని కూడా కలిసి ఆయన పాత్రకి సంబంధించిన క్యారెక్టరైజేషన్ ని తెలియజేశారట. దానికి రాజశేఖర్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తోంది. నిజానికి రామ్ చరణ్ రాజశేఖర్ కాంబినేషన్ లో ధ్రువ సినిమా రావాల్సింది. కానీ అప్పట్లో రాజశేఖర్ విలన్ పాత్రని చేయడానికి ఇష్టపడకపోవడంతో ఆ పాత్ర అరవిందస్వామి చేసి మంచి విజయాన్ని సాధించాడు.
అరవింద స్వామికి సైతం తెలుగులో మంచి ఐడెంటిటి ఏర్పడింది. ఇక ఇప్పుడు సుకుమార్ చేస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ నటిస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది… మొత్తానికైతే ఈ సినిమా భారీ బజ్ క్రియేట్ చేయడం గ్యారంటీ అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…