Rahu Gandhi : ఈరోజు కాంగ్రెస్ చరిత్రలో గుర్తించుకోవాల్సిన రోజు. కొత్త ఏఐసీసీ కార్యాలయాన్ని ప్రారంభించారు.కానీ ఆసందర్బంగా రాహుల్ గాంధీ ఉపన్యాసం పెద్దవివాదాన్ని రాజేసింది. వాస్తవానికి ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవంలో కాంగ్రెస్ ఘనతను వివరించాల్సి ఉంది.కానీ ఆర్ఎస్ఎస్ ను టార్గెట్ చేశాడు. సిద్ధాంతపరంగా వైరుద్యాలున్న మాట నిజమే అయినా.. దారుణ కామెంట్స్ చేశాడు.
‘ఫైటింగ్ ఆర్ఎస్ఎస్ , బీజేపీ.. నాట్ ఓన్లీ ఫైటింగ్ ద ఇండియన్ స్టేట్స్’ అంటూ దేశంలోని ప్రతిపక్ష నేత రాహుల్ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. నక్సలైట్లు, టెర్రరిస్టులు ఇలాంటివి మాట్లాడుతారు..
స్టేట్ మీద యుద్ధం ప్రకటించడం నిజంగా దేశద్రోహమే. ఆ రాజ్యానికి మూలాధారం రాజ్యాంగం..దేశం మీద, న్యాయవ్యవస్త మీద,పార్లమెంట్ మీద యుద్ధం ప్రకటించడమేనన్నట్టు.. నేవి, ఆర్మీ,పోలీసులపై యుద్ధం ప్రకటించినట్టే..
భారతీయ సంస్కృతిని పునరుద్ధరించిన రామాలయ ప్రారంభాన్ని పొగడటం తప్పా? రాహుల్ మాట్లాడిన మాటలపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు