Pawan Kalyan vs RRR: ఒక్కోసారి నిజాలు నిష్టూరంగా ఉంటాయి. నిన్నా మొన్న పవన్ కళ్యాణ్ వర్సెస్ రఘురామకృష్ణంరాజు గొడవ ముదిరింది. భీమవరంలో పేకాట స్థావరాలు బాగా జరుగుతున్నాయి.. దీని మీద దర్యాప్తు జరపాలని ఎస్పీతో మాట్లాడారు. అంతవరకూ బాగానే ఉంది. నివేదికను తనకు ఇవ్వాలని ఆదేశించారు. ఒక మంత్రి శాఖలోకి మరో శాఖలో మంత్రి ప్రవేశించి ఆదేశాలు ఇవ్వడం కరెక్ట్ కాదు. రాజ్యాంగబద్దంగా చూసుకున్నప్పుడు ఆయన ఒక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నాడు. హోంమంత్రి పరిధిలోకి ఈ కేసు వస్తుంది.
అభిమానం వేరే.. మనసుకు నచ్చనిది జరిగినప్పుడు నచ్చలేదని చెప్పడం వేరు. నివేదిక కోరడం అన్నది కరెక్ట్ పద్దతి కాదు. హోంమంత్రి అనిత ఈ విషయంలో స్పందించలేదు. చంద్రబాబు కూడా ఈ విషయంలో రియాక్ట్ కాలేదు.
అన్నింటికంటే ముఖ్యంగా పవన్ వ్యాఖ్యలపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు స్పందించాడు. భీమవరం రాజుల ఎక్కువగా ఉన్న ప్రాంతం. రాజు సామాజికవర్గాల్లో పేకాట, కోడిపందేలు చాలా కామన్. అందుకే రఘురామ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది.
పవన్ కళ్యాణ్ గారు భీమవరం పేకాటలపై అతిగా స్పందించారా? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.