ABN RK Politics: 1990వ దశకంలో ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ‘వినోదం’ చిత్రంలో ప్రకాష్ రాజ్ పాత్ర “నేను చాలా తెలివైనవాడిని” అనే లైన్‌ను ఫన్నీగా చెబుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ డైలాగ్‌కి తగ్గట్టుగా ప్రవర్తించే నిజజీవిత పాత్ర ఒకటుంది. ఆయన మరెవరో కాదు ఏబీఎన్ రాధా కృష్ణ అని మీడియా సర్కిల్స్ లో అనుకుంటారు..

మోడీతో కేసీఆర్ పోరాటం వల్ల తెలంగాణ చాలా నష్టపోతోందని తాజాగా తన పత్రికలో వ్యాసం రాశారు. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్ జగన్.. మోదీతో పోరాడాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ పోరాడితే నష్టపోతున్నాడని.. జగన్ మాత్రం పోరాటం చేకపోవడంతో నష్టపోతున్నాడని ఇలా రెండు రాష్ట్రాలకు రెండు విభిన్న అభిప్రాయాలను ఆర్కే వెలిబుచ్చాడు. బీజేపీకి చంద్రబాబు మద్దతు ఇచ్చినప్పుడే తెలుగుదేశం పార్టీ వెలిగిపోతుందన్నారు. ముగ్గురికి మూడు డిఫెరెంట్ అభిప్రాయాలను ఆర్కే చెప్పడం అందరినీ గందరగోళానికి గురిచేసింది.
దీనివెనుక రాధాకృష్ణ అసలు ఉద్దేశం ఏంటంటే.. మోడీ, వైఎస్ జగన్ లు ఒకరితో ఒకరు కలహించుకోవడం.. తరువత జగన్ రాజకీయంగా ఇబ్బంది పడటం ఆర్కే అంతిమ ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఎలాగైనా సరే చంద్రబాబుకు మంచి చేయాలన్న తపన, ఆకాంక్ష, పట్టుదల ఆయన రాతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే జగన్ కు తనేంటో.. తన పరిధి ఏంటో తెలుసు. అందుకే మోడీకి సలాం చేస్తున్నారు. మెడకు సీబీఐ కేసులు ఉండడంతో కేంద్రంలోని బీజేపీకి మద్దతు ఇస్తున్నారు.
ఇప్పటికే గత ఎన్నికల సమయంలో మోడీకి వ్యతిరేకంగా గళం విప్పినా.. మమతా బెనర్జీ ఇప్పుడు మౌనం వహిస్తూ బీజేపీతో వైరం కంటే కాస్త తగ్గి న్యూట్రల్ గా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కేంద్రంతో పని ఉండడంతో మోదీపై నోరు మెదపకుండా మౌనంగా ఉన్నారు. ఈ తరుణంలో రాధాకృష్ణ కలను నెరవేర్చేందుకు మోడీతో వైఎస్ జగన్ ఎందుకు గొడవ పడతాడన్నది ఇక్కడ ప్రశ్న?
ఆర్కే కేవలం న్యూస్ పేపర్ బ్రాండ్‌కు అధినేతగా ఉండి, తెలుగు రాజకీయాలను 90వ దశకంలా ప్రభావితం చేయాలని పగటికలలు కంటున్నాడు.కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఏది నిజం.? ఏది అబద్ధం అని ఇట్టే తెలిసిపోతోంది. సో ఆర్కే రాతలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ఆయన శత్రువైన జగన్ ను నమ్మడు. ఇక ఆర్కేను నమ్మి ముందుకెళ్లిన చంద్రబాబు సైతం గుడ్డిగా ముందుకెళ్లకుండా ఆచీతూచీ వ్యవహరిస్తున్నాడట.. ఆర్కే చాలా తెలివైన వాడినని.. నా మాటలు అందరూ వింటారని భావిస్తే.., ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత మేధావి అవుతారు? ఆర్కే ఎక్కువగా తనను తానే ఊహించుకుంటున్ారు. తన అతిశయోక్తి రచనలతో నవ్వుల పాలవుతున్నాడని చెప్పకతప్పదు.
ఆర్కే కొత్తపలుకు పేరిట ఎంత తెలివిగా రాసినా కూడా ఆయన చెప్పాడని జగన్ ఏకంగా దేశంలోనే పవర్ ఫుల్ మోడీతో పెట్టుకోవడానికి లేడు. ఇక కేసీఆర్ పెట్టుకొని నష్టపోతున్నాడని.. స్నేహం చేయడానికి ముందుకురారు. మొత్తంగా ఆర్కే తనను తానే మేధావి అనుకుంటున్నా.. ఆయనను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు, నేతలు లేరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
[…] […]