Chikoti Casino Issue: ప్రవీణ్ చీకోటి కేసినో వ్యవహారం ఉభయ తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. తెలంగాణతో పోల్చుకుంటే ఏపీలో ఈ సరికొత్త వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే గుడివాడలో కేసినో వ్యవహారం పెద్ద దుమారాన్నే రేపింది. వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని చుట్టూ విమర్శలు వచ్చాయి. అయితే అప్పట్లో దీనిని కొడాలి నాని లైట్ తీసుకున్నారు. తన సహజ శైలిలో కౌంటర్ ఇస్తూ తప్పించుకున్నారు. దబాయింపుతో ఇదో సాధారణ అంశంగా తేల్చేశారు. ప్రధాన విపక్షం ఆరోపణలు చేసినా.. గవర్నర్ కు కలిసి విన్నవించినా లైట్ తీసుకున్నారు. ఒకానొక దశలో తన అడ్డాలో, తన ప్రధాన అనుచరుల ప్రమేయంతో వ్యవహారం నడిచినా తనకేమీ తెలియదన్నట్టు బిల్డప్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఏకంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడం సంచలనంగా మారుతోంది. ప్రవీణ్ చీకొటి చుట్టూ ఉచ్చు బిగుస్తుండడం, పెద్ద ఎత్తున హవాలా డబ్బు చేతులు మారిందని ఆరోపణలు వస్తుండడంతో ఏపీ రాజకీయ నాయకుల్లో వణుకు ప్రారంభమైంది, ప్రవీణ్ చీకోటి మాత్రం గుట్టు విప్పితే తమ పరిస్థితి ఏమిటన్న భయం వారిని వెంటాడుతోంది. ఇప్పటికే గన్నవరం శాసనసభ్యుడు పేరు ప్రస్తావనకు రావడం, ఆయనతో ప్రవీణ్ దిగిన ఫొటోలు, సన్నహితంగా వ్యవహరించడం వంటివి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈడీ రంగంలోకి దిగి ప్రవీణ్ తో జరిగిన చీకటి వ్యవహారాలను బయటకు తీయ్యాలని భావిస్తుండడంతో మున్ముందు ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.

ప్రవీణ్ ఇంటి చుట్టూ చక్కెర్లు…
ప్రవీణ్ ను ఈడీ ప్రశ్నించడానికి నిర్ణయించడంతో ఆయనతో సన్నిహిత సంబంధాలు నెరిపిన నాయకులు అప్రమత్తమయ్యారు. తమ పేర్లు బయటపడకుండా చూడాలని అనుచరులను పురమాయిస్తున్నారు. వారు నేరుగా ప్రవీణ్ తో కలవాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన నివాసానికి క్యూకడుతున్నారు. ఈ పరిణామాలతో ఆందోళనకు గురవుతున్న ప్రవీణ్ కుటుంబసభ్యులు రక్షణ కల్పించాలని పోలీస్ శాఖను వేడుకుంటున్నారు. ప్రవీణ్ కు ప్రాణహని ఉందని భయపడుతున్నారు. ఒక వేళ ప్రవీణ్ చీకోటితో తమ సంబంధాలు వెలుగుచూస్తే మాత్రం రాజకీయంగా ప్రతిబంధకంగా మారే అవకాశముందని నేతలు భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఏపీ నేతలు మాత్రం తమ రాజకీయ భవిష్యత్ ముగిసిపోతుందన్న భయంతో బతుకుతున్నారు.
Also Read: ABN RK Politics: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధా కృష్ణది మామూలు తెలివికాదు? ఏం చేశాడో తెలుసా?
నయానో భయానో ప్రవీణ్ ను తమ దరిలో తెచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇన్నాళ్లు కౌంటర్ ఇస్తున్న నేతలు సైతం సైలెంట్ అయిపోయారు. పొరపాటున తమ పేరు మాత్రం బయటకు వస్తే మాత్రం విమర్శలు, ముప్పేట దాడిలు పెరిగే అవకాశముంది. పైగా ఈడీ కేసులు మెడకు చుట్టుకునే అవకాశం సైతం ఉంది. అయితే ప్రవీణ్ తో ఎక్కువగా సంబంధాలు ఏపీ నేతలకే ఉన్నాయని తెలియడంతో అటు వైసీపీ ప్రభుత్వంలో కూడా ఒకరకమైన ఆందోళన అయితే ఉంది. ఇప్పటికే ఈడీ దేశ వ్యాప్తంగా దూకుడు మీద ఉంది. పశ్చిమబెంగాల్ లో ఒక కేబినెట్ మంత్రినే అరెస్ట్ చేసి కటకటాలకు పంపించింది. కానీ అక్కడి సీఎం మమతా బెనర్జీ సైతం ఈ ఘటనలో సైలెంట్ అయ్యారు. అటువంటిది ఏ రాజకీయ నేపథ్యం లేని చీకోటి ప్రవీణ్ విషయంలో ఎందుకు వెనక్కి తగ్గుతారన్న వాదన వినిపిస్తోంది.

ఏపీలో సర్వత్రా ఆసక్తి..
అయితే ప్రవీణ్ చీకోటి వ్యవహారం బయటకు వచ్చినా తెలంగాణలో అంతా లైట్ తీసుకున్నారు. ప్రవీణ్ కారుకు ఎమ్మెల్యే మల్లారెడ్డి పేరిట స్టిక్కర్ ఉన్నా.. ఓ జిల్లా పరిషత్ చైర్మన్ నేరుగా సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపణలు వచ్చినా అక్కడ అంతగా హైలెట్ కాలేదు. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం అదో సీరియస్ ఇష్యూగా మారిపోనుంది. చాలా మంది పేర్లు ప్రవీణ్ వద్ద ఉన్నాయి. ఆయన పేర్లుకానీ ఈడీకి చెప్పినా.. హవాలా ధనం ఇచ్చినట్టు తెలిసినా వెంటనే ఈడీ రంగంలోకి దిగే చాన్స్ కనిపిస్తోంది. నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ నోటీసులు ఏ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడికి ఇచ్చినా సంచలనంగా మారే అవకాశం కనిస్తోంది. ఎదుటి పక్షానికి అస్త్రం దొరికినట్టవుతుంది. అందుకే అన్ని రాజకీయ పక్షాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. సాధారణంగా ఈడీ విచారణ అంటేనే ఎప్పడికప్పుడు అప్ డేట్స్ మీడియాకు లీకవుతుంటాయి. కేసు పురోగతి కోసమో.. లేకుంటే నిందితులను ఉక్కిరిబిక్కిరి చేయడానికో తెలియదు కానీ.. అటు విచారణ జరుగుతుండగానే కొత్త పేర్లు బయటకు వస్తుంటాయి. డ్రగ్స్ కేసులో కూడా ఇటువంటి పరిస్థితే కనిపించింది. ఈసారి కూడా అలానే పేర్లు బయటకు వచ్చే అవకాశముందని తెలియడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read:YCP- TDP: వైసీపీ సంక్షేమం వైపా.. టీడీపీ అభివృద్ధి వైపా.. ఎటూ తేల్చుకోలేకపోతున్న జనం
[…] […]