Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత్ జోరు కొనసాగిస్తోంది. పతకాల పట్టికలో అగ్రస్థానం చేరేందుకు ప్రయత్నిస్తోంది. రోజు పతకాల సాధనలో ముందంజలో నిలుస్తోంది. ఫలితంగా పతకాల వేటలో క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్ లో దుమ్ము లేపుతున్నారు. వెయిట్ లిఫ్టింగ్ లో మూడు స్వర్ణాలు సొంతం చేసుకుని మనకు తిరుగులేదని నిరూపించారు. మొదటి స్వర్ణం మీరా బాయి చాను, రెండో స్వర్ణం జెరెమీ దక్కించుకుంది. ఇక మూడో స్వర్ణం అచింత షూలి సొంతం చేసుకున్నాడు దీంతో భారత్ కు ఎదురే లేకుండా పోయింది.

ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు జరగనున్నాయి. గత సంవత్సరం కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మూడో స్థానం దక్కించుకుంది. 2010లో మనదేశం ఆతిథ్యం ఇవ్వడంతో రెండో స్థానం సాధించింది. దీంతో ఈ సంవత్సరం కూడా మంచి ప్రదర్శన చేసి మంచి ఫలితాల సాధనకు క్రీడాకారులు దృష్టి సారిస్తున్నారు. ఆ దిశగా దూసుకెళ్తున్నారు. బర్మింగ్ హామ్ లో మన క్రీడాకారులు 210 మంది పాల్గొంటున్నారు. దీంతో పతకాల వేటలో కూడా జోరు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: YCP- TDP: వైసీపీ సంక్షేమం వైపా.. టీడీపీ అభివృద్ధి వైపా.. ఎటూ తేల్చుకోలేకపోతున్న జనం
బ్యాట్మింటన్ లో పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ పై భారత్ భారీ ఆశలే పెట్టుకుంది. బ్యాట్మింటన్ లో వారే మనకు పతకాలు తెచ్చే క్రీడాకారులుగా ఉన్న సంగతి తెలిసిందే. అథ్లెటిక్స్ విభాగంలో మనకు పతకాలు వచ్చే అవకాశాలు తక్కువనే తెలుస్తోంది. ప్రస్తుత క్రీడల్లో మహిళల క్రికెట్ కూడా ప్రవేశపెట్టడంతో మన వారు పతకం తీసుకొస్తారో లేదో తెలియడం లేదు. కానీ మొత్తానికి మనవారు మాత్రం దీటైన పోటీ ఇవ్వడం మాత్రం ఖాయమని తెలుస్తోంది. బర్మింగ్ హామ్ లో పతకాల పంట పండించేందుకు క్రీడాకారులు కృషి చేస్తున్నారు.

తాజాగా 73 కేజీల విభాగంలో అచింత షూలి స్వర్ణ పతకం కైవసం చేసుకుని సత్తా చాటాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన అచింత పతకం గెలుచుకోవడంలో భాగంగా తొలుత 137 కేజీల విభాగంలో రెండో ప్రయత్నంలో 140 కేజీలు ఎత్తాడు. మూడో ప్రయత్నంలో 147 కేజీలు ఎత్తి చరిత్ర సృష్టించాడు. ఇదే విభాగంలో మలేషియాకు చెందిన హిదాయత్ రెండో స్థానంలో కెనడాకు చెందిన షాద్ మూడో స్థానంలో నిలిచారు. దీంతో మనవాడు స్వర్ణం చేజిక్కించుకుని మనకు పతకం తీసుకురావడం జరిగింది.
Also Read:YCP MPs: సగం మందికిపైగా ఎంపీలకు నో చాన్స్.. వైసీపీలో ఏం జరుగుతోంది?