Vijay Devarakonda : రౌడీ బాయ్ ప్లే బాయ్ అని తేలిపోయింది. పెళ్లికి ముందే ఆ శృంగార వాంఛను తీర్చుకున్నాడని తేటతెల్లమైపోయింది.ఎవరైనా నీట్ క్లీన్ ఇమేజ్ కోసం వ్యక్తిగత జీవితంలోని రహస్యాలను దాచేస్తారు. కానీ మన విజయ్ దేవరకొండ.. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహర్ ‘ఫస్ట్ శృంగారం’ గురించి అడగగానే టపీటపీమనీ అన్ని మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేశాడు. తాను ఇప్పటికే రెండు సార్లు శృంగారంలో పాల్గొనని.. ఎప్పుడు ఎక్కడ చేశానో పూసగుచ్చినట్టు విజయ్ వివరించాడు. దీంతో ఇన్నాళ్లు ‘విజయ్ దేవరకొండ’ మంచి బాలుడు అని అందరూ అనుకున్న వారికి.. కాదు కాదు.. తాను ‘నాటీ బాయ్’ అని జ్ఞానోదయం చేసేశాడు.

మద్యపానం ఆరోగ్యానికి హానికరం.. అంతేకాదు మద్యం తాగి డ్రైవ్ చేస్తే పోలీసులు ఫైన్ విధిస్తారు.. ఆఫీసుకెళ్తే ఉద్యోగం ఊడుతుంది.. మరి ఆల్కహాల్ తీసుకొని సినిమా షూటింగ్ కు వెళ్లొచ్చా..? అంటే వెళ్లొచ్చంటున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఎందుకంటే ఆయన సినిమా షూటింగ్ కు ఓసారి మద్యం తాగి వెళ్లారట. అయితే అలా మద్యం తాగి వెళ్లడం వల్ల కొన్ని సమస్యలు ఎదురయ్యాయట. తనకే కాకుండా షూటింగ్ లో ఉన్నవారికి ఇబ్బందులు తప్పలేదట. ఇంతకీ విజయ్ దేవరకొండ ఏ సినిమా షూటింగ్ కు మద్యం తాగి వెళ్లారు..? ఆ తరువాత ఏం జరిగిందన్నది తాజాగా ‘కాఫీ విత్ కరణ్ షో’లో బయటపెట్టాడు. అదిప్పుడు వైరల్ గా మారింది..
మనసులో ఉన్న విషయాలను బయటపెట్టేందుకు సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసే ప్రోగ్రాం ‘కాఫీ విత్ కరణ్’. ఇందులో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తూ సెలబ్రెటీల గురించి అడిగి తెలుసుకుంటారు. వారి పర్సనల్ విషయాలపై కొశ్చన్స్ చేస్తూ వారి గుట్టును రట్టు చేశారు. ఒక రకంగా ఈ షో కు ‘బోల్డ్ షో’ అని పేరు కూడా వచ్చింది. ఎందుకంటే లవ్, సెక్స్, రిలేషన్స్ , నెపోటిజం వంటి ప్రశ్నలు అడుగుతారు. కొందరు అలాంటి విషయాల్లో తమ జీవితంలో జరిగినా బయటికి చెప్పరు. కానీ కొందరు మాత్రం మనసులో ఆపుకోలేక బయటపడుతుంటారు. ఇటీవల ‘కాఫీ విత్ కరణ్’ షో కు విజయ్ దేవరకొండ వెళ్లారు. అక్కడ తన మనసులో దాగి ఉన్న ఓ విషయాన్ని బయటపెట్టారు.
‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ..‘గీత గోవిందం’ సినిమాతో ఫేమస్ అయ్యారు. ఆ తరువాత చాలా సినిమాలు చేశారు. లేటెస్టుగా డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమా కోసం పనిచేస్తున్నారు. పూరి, విజయ్ కాంబినేషన్లో వస్తున్న ‘లైగర్’ సినిమా విశేషాలు ఇప్పటికే మీడియా ద్వారా బయటికి వచ్చాయి. ఈ సినిమాతో విజయ్ ప్రతిష్ట బాలీవుడ్ రేంజ్ కు వెళ్లింది. ఇటీవల ఓ న్యూడ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విజయ్ గురించి సినిమా ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది.
ఈ నేపథ్యంలో ‘లైగర్’ సినిమాలో నటిస్తున్న విజయ్ దేవరకొండ, అనన్యపాండేను ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయ్ ని కరణ్ పలు ప్రశ్నలు అడిగారు. కొన్ని బోల్డ్ కు సంబంధించిన విషయాలు కూడా చర్చకు వచ్చాయి. అయితే విజయ్ దేవరకొండను ‘ఎప్పుడైనా తాగిన మత్తులో షూటింగ్ వెళ్లావా..?’ అని కరణ్ అడిగారు. దీంతో విజయ్ మాట్లాడుతూ ‘ఓ సినిమా షూటింగ్ కు వెళ్లే రోజు ముందు బర్త్ డే పార్టీ జరిగింది. ఈ పార్టీలో ఫుల్ గా తాగాను. అయితే తెల్లారి హాంగోవర్లోనే షూటింగ్ కు వెళ్లారు. అక్కడ ఓ సన్నివేశం కోసం తాగాల్సి వచ్చింది. అదీ, ఇది కలిసి ఎక్కువైంది.. దీంతో డైలాగ్స్ మరిచిపోయాను. పిచ్చి నవ్వులు నవ్వాను. చేసేదేమీ లేక ఆరోజు షూట్ క్యాన్సిల్ చేశారు. అయితే నాకు మద్యం ఎక్కువ కావడంతో కొంత మంది ఇబ్బంది పడ్డారు. కానీ పెద్ద నష్టమేమి జరగలేదు’ అని అన్నారు.
విజయ్ దేవరకొండ సినీ కెరీర్లో అర్జున్ రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్. ఈ సినిమాలో మద్యం తాగే సీన్లు ఎక్కువగా ఉన్నాయి. బహుశా ఈ సినిమా షూటింగ్ సమయంలోనే విజయ్ మద్యం తాగి వెళ్లొచ్చు… అని కొందరు అనుకుంటున్నారు. అయితే నిజజీవతంలోనూ విజయ్ కి తాగే అలవాటు ఉందని ‘కాఫీ విత్ కరణ్’ ద్వారా తెలిసిపోయింది.
ఇక లైగర్ హీరోయిన్ అనన్య పాండేతోన తాను డేట్ కు వెళ్లానని.. కానీ అది కేవలం ఫ్రెండ్ షిప్ డేట్ అని విజయ్ ఏదో విషయాన్ని దాచేసినట్టు తెలుస్తోంది. ఇక విజయ్ కారులోనే శృంగారం చేశాడని అనన్య పాండే అనడంతో వీరిద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో జరిగిందని మాత్రం ‘కాఫీ విత్ కరణ్’ షో ద్వారా తెలిసిపోయింది. ప్రస్తుతం విజయ్ తో కరణ్ జోహర్ ఇంటర్వ్యూ మాత్రం వైరల్ అవుతోంది.