Frog and Snake : కప్ప, పాములు విరుద్ధ జాతులు. కప్ప కనిపించగానే పాము లొట్టలేస్తుంది. ఎప్పుడు దానిని నోట్లో వేసుకుందామా..? అని చూస్తుంది. అందుకే కప్పలు ఉన్న చోట పాములు ఎక్కువగా ఉంటాయంటారు. కప్పలు ఆహారం కోసం ఎగురుతూ వెళ్తుంటాయి.. పాము పాకుతూ వెళ్తుంది. ఇలా అవి ప్రయాణించడం వల్ల ప్రపంచానికి రూ.1.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందట. అవి అలా వెళితే మనకు అన్ని లక్షల కోట్ల నష్టం అని ముక్కున వేలేసుకోకండి.. ఇది నిజంగానే నిజం.. కప్ప వెళ్లిన చోట పంట నష్టం ఎక్కువగా ఉంటే.. పాము విద్యుత్ తీగలపై పాకుతూ అత్యధిక నష్టాన్ని తెచ్చిపెట్టిందట. తాజాగా ఓ సంస్థ గురువారం ఇందుకు సంబంధించిన నివేదికను బయటపెట్టింది. అదే సంచలనమైంది. అమెరికన్ బుల్ ప్రాగ్ (కప్ప), బ్రౌన్ ట్రీ స్నేక్(పాము)లు ప్రపంచానికి తీవ్ర నష్టాన్ని కలిగించాయని ఆ సంస్థ తెలిపింది.

సైంటిఫిక్ రిపోర్ట్స్ లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం.. లిథోబేట్స్ కాటేస్ బియానస్ అని పిలిచే కప్ప ఐరోపాలో కనిపిస్తుంది. ఇది అన్ని కప్పల కంటే కాస్త డిఫెరెంట్ గా గోధుమ లేదా ఆకుపచ్చ రంగులో ఉంటాయి.. ఈ కప్ప 2 ఫౌండ్ల బరువు ఉంటుంది. ఈ కప్ప ఐరోపాలో అత్యధిక నష్టాన్ని కలిగించిందని పరిశోధనలో తేలింది. ఇవి ఎక్కువగా సింగపూర్లోని జురాంగ్ ఫామ్ హౌజ్ లో ఉంటాయి.. అక్కడ నష్టాన్ని కలిగించాయట..
ఇక బ్రౌన్ ట్రీ స్నేక్ ఎక్కువగా పసిఫిక్ దీవుల్లో కనిపిస్తుంది. ఈ దీవుల్లో 2 మిలియన్లకు పైగా ఈ పాములు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే ఈ రకమైన పాములు విద్యుత్ తీగలపై ఉండడం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిందని, దీనివల్ల భారీ నష్టం కలిగిందని తెలిపారు.
వీటి చర్యల వల్ల ప్రపంచానికి 16 బిలియన్ డాలర్లు నష్టం జరిగిందని నివేదిక తేల్చింది. 1986 నుంచి 2020 ల మధ్య ఈ అంచనాను లెక్కించినట్లు పరిశోధన చేసిన సంస్థ తెలిపింది. దీనిపై పరిశోధకుడు ఇస్మాయిల్ మాట్లాడుతూ.. బ్రౌన్ ట్రీ స్నేక్ పసిఫిక్ దీవుల్లో ఎక్కువగా ఉందన్నారు. బోయిగా ఇర్రెగ్యులారిస్, గువామ్, మరియానా దీవుల్లో ఇవి కనిపిస్తాయని అన్నారు. ప్రపంచయుద్ధం సమయంలో ఈ రకమైన పాములను అమెరికా వాడిందని అన్నారు.
చెక్ రిపబ్లిక్లోని సౌత్ బోహేమియా విశ్వవిద్యాలయ పీహెచ్ డీ విద్యార్థి సోటో మాట్లాడుతూ.. ఈరోజుల్లో జంతువులను పెంచుకునేవారు ఈ రకమైన పాములను కొందరు పెంచుకుంటున్నారని తెలిపారు. అయితే వాణిజ్యం కోసం వీటిని నియంత్రించారని, కానీ ఈ జాతులను పరిరక్షించాలని కోరారు. పీర్ రివ్యూడ్ లిటరేచర్ వివరించిన ప్రకారం.. ప్రపంచం నష్టపోయిన వ్యయాల లెక్కింపులో భాగంగా ఈ కప్పు, పాము వల్ల కూడా 1.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. ఈ రెండింటి వల్ల ప్రపంచానికి ఇంత పెద్ద నష్టం జరిగిందా? అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.