Marriage Age: ఈడంత పోయినాక పెళ్లెందుకు.. ఆకలంత పోయినాక అన్నమెందుకు అంటారు. ఏ వయసులో జరగాల్సిన అచ్చటముచ్చట ఆ వయసులో జరగాలి. లేకపోతే కష్టమే. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులున్నా వివాహం మాత్రం కచ్చితంగా సరైన సమయానికే చేసుకుంటే బాగుంటుంది. దీని కోసం యువత సిద్ధమవ్వాలి. ఉపాధి దొరికిన తరువాత చేసుకుంటానని వాయిదా వేసుకుంటే అది కుదరదు. పెళ్లి అనేది వాయిదా వేస్తే మనకు ఇబ్బందులు తప్పవు.

అప్పటికే బంధువులు, తల్లిదండ్రులు ఒకటే గోల చేస్తారు. ఎప్పుడు చేసుకుంటావని నిలదీస్తారు. అందుకే వారికి అవకాశం ఇవ్వకుండా మనమే సమయానికి తంతు పూర్తయ్యేలా చూసుకోవాలి. ఈడు, జోడు, గుణం అన్ని ఉండాలంటే కుదరదు. ఏవో కొన్ని కావాలంటే కొన్ని త్యాగాలు చేయక తప్పదని తెలుసుకోవాలి. అందుకోసమే మనం అనుకున్న సమయానికి వివాహం జరిగేలా ప్లాన్ చేసుకోవాలి.
ప్రభుత్వం కూడా ఇటీవల వివాహ వయసు 21కి పెంచడంతో ఇక ఆలస్యం చేస్తే లాభం లేదని తల్లిదండ్రులే తెలియజెప్పాలి. ముదిరితే పిల్ల దొరకడం కూడా కష్టమే. అందుకే కనీస వివాహ వయసు దాటగానే సంబంధాలు చూసుకోవాలి. పిల్లకు వంకలు పెట్టకుండా ఏదో దొరికిన కాడికి అని సర్దుకుపోతుండాలి. లేకపోతే వివాహం మరింత ఆలస్యమైతే సంతాన సమస్య రావచ్చు.
వీటన్నింటి గురించి తెలియజెపుతూ అప్రమత్తం చేస్తుండాలి. అప్పుడే పెళ్లి తంతు కూడా ఇంకా లేటు చేస్తే లేటు వయసు కావడంతో పిల్ల దొరకడం గగనమే. దీనికోసం వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయి సంబంధాలు చెడిపోకుండా జాగ్రత్త పడాలి. అన్ని షరతులు పెడితే కుదరదు. ఏదో గంతకు తగ్గ బొంత అంటూ ముందుకు పోవాల్సిందే. దీని కోసం పిల్లలను తల్లిదండ్రులే సిద్ధంగా ఉంచాలి.

ఆలస్యమైతే జరిగే అనర్థాల గురించి విడమర్చి చెప్పాలి. లేటయితే సంతానం కావడం కష్టంగా మారుతుందని వివరించాలి. అప్పుడే వారు వివాహానికి తయారయి తొందరగా పెళ్లి చేసుకునేందుకు ముందుకు వస్తారు. వారి తల్లిదండ్రుల అచ్చటముచ్చట కూడా తీరుతుంది. పిల్లల కోరికలు కూడా నెరవేరుతాయి.
Recommended Videos
[…] […]