Homeజాతీయ వార్తలుUP Atiq Ahmed : నెరవేరిన యోగి పంతం: చూస్తుండగానే గ్యాంగ్ స్టర్ లను చంపేశారు.....

UP Atiq Ahmed : నెరవేరిన యోగి పంతం: చూస్తుండగానే గ్యాంగ్ స్టర్ లను చంపేశారు.. లైవ్ వీడియో

 

 

UP Atiq Ahmed : పోలీసులు, మీడియా ప్రతినిధులు, పక్కన జనం.. అంతటి సందోహం లో ఇద్దరి కణత కు రివాల్వర్ దగ్గర పెట్టి బుల్లెట్లు సఫా సఫా దించేశారు. చూస్తుండగానే ఆ ఇద్దరు రక్తపు మడుగులో విలవిలా కొట్టుకుంటూ ప్రాణాలు వదిలారు. అలా కన్ను మూసింది ఎవరో అమాయకులు కాదు. అమాయకుల ప్రాణాలు బలిగొన్న ఇద్దరు పేరు మోసిన గ్యాంగ్ స్టర్ లు. ఈ ఘటన జరిగింది ఉత్తరప్రదేశ్ లో. ఇప్పుడు ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నది. “మీడియా వల్లే నేను బతికి ఉన్నానని” రెండు రోజుల క్రితం ప్రకటించిన గ్యాంగ్ స్టర్ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్.. మీడియా సమక్షంలోనే హత్యకు గురి కావడం విశేషం. రెండు రోజుల క్రితం అతిక్ అహ్మద్ కొడుకు అసద్ ను  పోలీసులు ఎన్కౌంటర్లో చంపేశారు.. ఈ ఘటనతో నిండు శాసనసభలో ” మాఫియాను మట్టిలో కలిపేస్తా” అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పిన మాటలు జస్టిఫై అయ్యాయి.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీలు తమ రాజకీయ ప్రాపకం కోసం గూండారాజ్ ను ప్రోత్సహించారు.. దీనివల్ల అక్కడ మాఫియా అనేది సమాంతర వ్యవస్థగా ఏర్పడింది. అక్రమాలు, దౌర్జన్యాలకు లెక్కే లేకుండా పోయింది. అడ్డుకునే వ్యవస్థలు పక్కకు తప్పుకోవడంతో సామాన్యుల బతుకు దారుణంగా మారింది. మాఫియాకు రాజకీయ నాయకులు ప్రోత్సాహం అందించడంతో అక్కడ గుండా రాజ్ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లింది. అలాంటి ఉత్తరప్రదేశ్ లో పేట్రేగి పోతున్న గూండారాజ్ లో అతీక్ అహ్మద్, అశ్రాఫ్ అహ్మద్ లు కీలకంగా ఉన్నారు. ఈ అతీక్ అహ్మద్ కు సమాజ్ వాదీ పార్టీ అప్పట్లో ఎంపీ టికెట్ ఇచ్చింది. తనకున్న బలంతో అతిక్ గెలిచాడు. తర్వాత తన నేర సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకున్నాడు. 50 వరకు ఊరూ పేరులేని కంపెనీలు ఏర్పాటు చేశాడు. అడ్డగోలుగా నల్లధనాన్ని సంపాదించాడు. ఆ కంపెనీల ద్వారా నల్లధనాన్ని తెల్లగా మార్చుకునేవాడు. ఇతగాడికి పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి ఆయుధాలు సరఫరా అయ్యేవి.. అధికారిక లెక్కల ప్రకారమే 1400 కోట్ల నేర సామ్రాజ్యాన్ని అతీక్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇతగాడి పైన వందకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి.

2006 లో బిజెపి నాయకులు ఉమేష్ పాల్ ను అపహరించిన కేసులో అతీక్, అతడి సోదరుడు అశ్రాఫ్ మీద కేసులు ఉన్నాయి. దీనికి సంబంధించి గత నెల 29న ప్రయాగ్ రాజ్ కోర్టు అన్నదమ్ములు ఇద్దరికీ యావజ్జీవ శిక్ష విధించింది. మరో వైపు 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ ను అతీ క్ దారుణంగా హతమార్చాడు. అయితే ఈ కేసులో ఉమేష్ పాల్ అనే వ్యక్తి కీలక సాక్షి.. అయితే అప్పటినుంచే ఉమేష్ పాల్ ను అతీక్ టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అతీక్ కుమారుడు అసద్ ఉమేష్ ఇంట్లోకి నేరుగా చొరబడి అతన్ని కాల్చి చంపేశాడు.. అయితే అతడు అప్పటినుంచి పరారీలో ఉన్నాడు.. ఎట్టకేలకు అతడిని యూపీ పోలీసులు ఝాన్సీ వద్ద ఎన్ కౌంటర్ చేశారు. ఈ కేసులో అతీక్ ను పీటీ వారెంట్ పై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అసద్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు బాధ్యత కారణాల దృష్ట్యా అతీక్ ను పోలీసులు అనుమతించలేదు..అయితే అసద్ అంత్యక్రియలు జరిగిన గంటలోపే అతీక్ హత్యకు గురి కావడం విశేషం.

అసద్ అంత్యక్రియలు జరిగిన తర్వాత అతీక్ ” మేం మట్టిలో కలిసిపోయాం. పైన ఉన్న అల్లా మొత్తం చూస్తున్నాడు” అంటూ మీడియాతో వ్యాఖ్యలు చేశాడు. అనంతరం అతడిని, అతడి మరో కుమారుడిని శనివారం రాత్రి 11 గంటలకు పోలీసులు ప్రయాగ్ రాజ్ లోని కెల్విన్ హాస్పటల్లో పరీక్షలకు తీసుకెళ్తున్న సమయంలోనూ అతీక్ మీడియాతో మాట్లాడాడు. ” మీ వల్లే నేను బతికి ఉన్నాను  అంటూ” మీడియా ప్రతినిధులతో చెబుతుండగా… ముగ్గురు వ్యక్తులు మీడియా ఐడి రికార్డులు ధరించి అక్కడకు చేరుకున్నారు. ఆ ముగ్గురిలో ఒకడు అతీక్ కణత పై రివాల్వర్ పెట్టి, ట్రిగ్గర్ నొక్కేశాడు.  వెంటనే అతడు కుప్ప కూలిపోయాడు..ఆ వెంటనే వారు ఆశ్రాఫ్ వైపు వచ్చారు. అతన్ని కూడా కాల్చి చంపారు. అంతేకాదు కుప్పకూలిన ఆ ఇద్దరిపై కాల్పులు కొనసాగించారు.. ఆ ముగ్గురు దుండగులు జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. అక్కడ ఉన్న పోలీసులు ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.

అతీక్, అశ్రఫ్ తో పాత కక్షలు ఉండటంవల్లే ఆ ముగ్గురు హతమార్చినట్టు తెలుస్తున్నది. ఆ ముగ్గురిని లవ్లేష్ తివారీ, సున్నీ, అరుణ్  మౌర్య గా పోలీసులు గుర్తించారు. ఇక ఉమేష్ పాల్ హత్యకు సంబంధించి అతీక్, ఆశ్రగ్ ప్రధాన నిందితులు..అతీక్, ఆశ్రఫ్ సూచన మేరకు ఉమేష్ ను కాల్చి చంపిన అసద్ ఏ_3 గా ఈ కేసులో ఉన్నాడు. ఈ కేసులో అతడు హత్యకు ఉపయోగించిన రెండు పిస్టల్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయాగ్ రాజ్ పోలీసులు కోర్టు అనుమతితో సీన్ రీ కన్స్ట్రక్షన్ చేపట్టారు.. ఈక్రమంలో వారిని ప్రయాగ్ రాజ్ చివర్లో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. హత్యకు ఉపయోగించిన ఓ అమెరికా పిస్టల్, మరో నాటు తుపాకీ, పలు చూటాలను స్వాధీనం చేసుకున్నారు..ఆ తూటాల్లో ఐదు పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైనట్లు గుర్తించారు. అప్పటికి రాత్రి అవ్వడంతో వారిని జైలుకు పంపించే క్రమంలో అయితే పరీక్షల నిమిత్తం ప్రయాగ్ రాజ్ లోని కెల్విన్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పటికే రాత్రి 10;50 అయింది. కాగా 11 గంటలకు  అతీక్, అశ్రఫ్ హతమయ్యారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular