
Rudrudu : కొన్ని సార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ కావు అనుకున్న సినిమాలు భారీ వసూళ్లను రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి.రీసెంట్ గా రాఘవ లారెన్స్ హీరో గా నటించిన ‘రుద్రుడు’ అనే సినిమా కూడా అందుకు ఒక ఉదాహరణ గా నిలిచింది.కాంచన సిరీస్ తో లారెన్స్ కి అటు తమిళం లోను ఇటు తెలుగు లోను మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడింది.
గమ్మత్తు ఏమిటంటే నిన్న రుద్రుడు అనే సినిమా థియేటర్స్ లోకి వచ్చేంత వరకు అసలు ఈ సినిమా ఒకటి ఉందని ఆడియన్స్ కి ఏమాత్రం తెలియదు.ప్రొమోషన్స్ ఆ రేంజ్ లో చేసారు మరి.కానీ లారెన్స్ కి మాస్ ఆడియన్స్ సపోర్టు ఫుల్లుగా ఉండడం వల్ల ఈ చిత్రానికి మాట్నీస్ నుండి అద్భుతమైన ఆక్యుపెన్సీలు వచ్చాయి.ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి ఓపెనింగ్ పడింది.
ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం ఈ సినిమాకి మొదటి రోజు 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.ఇక రెండవ రోజు అయితే మొదటి రోజుకి మించి దాదాపుగా కోటి రూపాయిల షేర్ ని రాబట్టింది అట.అలా మొదటి రెండు రోజులకు గాను ఈ సినిమా కోటి 80 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టింది.
ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 7 కోట్ల రూపాయలకు జరిగింది.మొదటి మూడు రోజులకు కలిపి దాదాపుగా మూడు కోట్ల రూపాయిల వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు.ప్రొమోషన్స్ లేకుండా ఇంత మొత్తం రాబట్టడం సాధారణమైన విషయం కాదు, వర్కింగ్ డేస్ లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ వచ్చే వీకెండ్ కూడా అదరగొడితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ చాలా సులువుగా అయిపోతుందని అంటున్నారు.మరి అది నిజం అవుతుందో లేదో చూడాలి.